Express Train Caught Fire: అవధ్-అసోం ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో మంటలు.. రైలు నుంచి దూకిన ప్రయాణికులు
బీహార్ (Bihar)లోని ముజఫర్‌పూర్ జిల్లాలో అవధ్-అస్సాం ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏసీ కోచ్‌లో అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో కలకలం రేగింది. రైలు ఆగిన వెంటనే చాలా మంది ప్రయాణికులు బోగీ నుంచి దూకారు.
- Author : Gopichand
Date : 09-02-2023 - 8:17 IST
Published By : Hashtagu Telugu Desk
బీహార్ (Bihar)లోని ముజఫర్‌పూర్ జిల్లాలో అవధ్-అస్సాం ఎక్స్‌ప్రెస్ రైలులోని ఏసీ కోచ్‌లో అకస్మాత్తుగా పొగలు వచ్చాయి. దీంతో రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల్లో కలకలం రేగింది. రైలు ఆగిన వెంటనే చాలా మంది ప్రయాణికులు బోగీ నుంచి దూకారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రైలు అస్సాంలోని దిబ్రూగఢ్ నుంచి లాల్‌గఢ్ (పశ్చిమ బెంగాల్)కు వెళ్తోంది.
మీడియా నివేదికల ప్రకారం.. దిబ్రూగఢ్ నుండి లాల్‌గఢ్ వెళ్తున్న అవధ్-అస్సాం ఎక్స్‌ప్రెస్ B2 కోచ్ నుండి అకస్మాత్తుగా పొగలు రావడం ప్రారంభించాయి. కొద్దిసేపటికే ఏసీ బోగీలో పొగలు వ్యాపించాయి. వెంటనే రైలును రామదయాలు స్టేషన్‌లో నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు కోచ్ లో నుంచి దూకి పరుగులు తీశారు. అయితే వెంటనే మంటలు అదుపులోకి వచ్చాయి. సమాచారం అందుకున్న వెంటనే రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ అనంతరం రైలును పంపించారు.
#WATCH | Bihar: Avadh Assam Express caught fire near Ramdayalu Railway Gumti in Muzaffarpur yesterday. pic.twitter.com/m584LRQtGz
— ANI (@ANI) February 8, 2023
అవధ్-అస్సాం ఎక్స్‌ప్రెస్ ముజఫర్‌పూర్ రైల్వే స్టేషన్ నుండి బయలుదేరిందని, అయితే కొంత సమయం తర్వాత అకస్మాత్తుగా AC కోచ్ నుండి పొగలు రావడం ప్రారంభమైందని ప్రయాణికులు చెప్పారు. దీంతో ప్రయాణికుల్లో కలకలం రేగింది. వెంటనే రామదయాలు స్టేషన్ ఔటర్ సిగ్నల్ వద్ద రైలును నిలిపివేసి మంటలను ఆర్పివేశారు. అనంతరం రైలును రామదయాలు స్టేషన్‌కు తీసుకొచ్చి పూర్తి విచారణ చేపట్టారు.
అగ్నిప్రమాదానికి కారణం స్పష్టంగా లేదు
ప్రస్తుతం అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. అగ్నిప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని రైల్వే కార్మికుడు తెలిపారు. అయితే అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడాల్సి ఉంది. అదే సమయంలో మంటల కారణంగా కోచ్‌కు ఎంత మేరకు నష్టం జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది.