Telugu News

News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄India News
  • ⁄As Rebellion In Ruling Shiv Sena Triggers Political Crisis Floor Test Back In Focus

Maharashtra : `విశ్వాసం` ప‌రీక్ష దిశ‌గా `మ‌హా` స‌ర్కార్

  • By CS Rao Published Date - 09:00 PM, Thu - 23 June 22
Maharashtra : `విశ్వాసం` ప‌రీక్ష దిశ‌గా `మ‌హా` స‌ర్కార్

మ‌హారాష్ట్ర రాజ‌కీయం మ‌లుపులు తిరుగుతోంది. తాజాగా ఏక్ నాథ్ షిండే బ‌దులుగా అజ‌య్ చౌద‌రిని శివ‌సేన గ్రూప్ లీడ‌ర్‌గా నియమించారు. ఇప్ప‌టి వ‌ర‌కు శాస‌న స‌భ‌లో షిండే పోషించిన పాత్ర‌ను చౌద‌రికి అప్ప‌గిస్తూ పార్టీ తీసుకున్న నిర్ణ‌యాన్ని డిప్యూటీ స్పీక‌ర్ నరహరి జిర్వాల్ ఆమోదం తెలిపారు. ఈ ప‌రిణామం ద్వారా అధికార కూటమి బలపరీక్ష కు వెళ్ల‌డానికి స‌న్నాహాలు చేసుకుంటున్న‌ట్టు అర్థం అవుతోంది. మహారాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీహరి మాట్లాడుతూ, షిండే నేతృత్వంలోని రెబ‌ల్ ఎమ్మెల్యేల బృందం ప్రస్తుత మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వానికి (సేన, ఎన్‌సిపి మరియు కాంగ్రెస్‌లతో కూడిన) మద్దతు ఇవ్వ‌దు. దీంతో ప్రభుత్వం మెజారిటీని కోల్పోయినందున అవిశ్వాస తీర్మానానికి దారి తీస్తుందని అన్నారు.

సేన నేతృత్వంలోని MVA ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకోవడానికి విశ్వాస ప‌రీక్ష‌కు సిద్ధం అయ్యే అవ‌కాశం ఉంద‌ని శ్రీహ‌రి అంచ‌నా వేస్తున్నారు. తిరుగుబాటు గ్రూపుకు ఉన్న ఎమ్మెల్యేల‌ సంఖ్యను నిర్ధారించిన తర్వాత ఫ్లోర్ టెస్ట్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అనీ అన్నారు. ఆ త‌రువాత‌ MVA మెజారిటీని కోల్పోయిందని సూచిస్తుంది. బిజెపితో పాటు తిరుగుబాటు బృందం కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్ర‌య‌త్నం చేయ‌డానికి అవకాశం ఉంది. ఆ తర్వాత గవర్నర్ బలపరీక్ష కోసం అడుగుతారు. శివసేన ఎవరిది? ఆ పార్టీ చిహ్నం విల్లు, బాణాల హక్కుదారు ఎవరికి వ‌స్తుంది? అనే ప్రశ్న ఉంద‌ని అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ అంటున్నారు.

రాజ్యాంగం ప్ర‌కారం ఎన్నిక‌ల‌ కమీషన్ ఒక రాజకీయ పార్టీని నమోదు చేస్తుంది. ఒక గుర్తును కేటాయిస్తుంది. నిజమైన శివసేనకు సారథ్యం వహిస్తున్నానని, పార్టీ గుర్తు కోసం దరఖాస్తు చేసుకోబోతున్నానని షిండే చెప్ప‌డంతో గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. దీనిని ఉద్ధవ్ ఠాక్రే వర్గం వ్యతిరేకిస్తుంది. ఒక రాజకీయ పార్టీలో 2/3వ వంతు చీలిక, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా ఉంటుంది. ఆ ప్ర‌క్రియ శాసనసభా పక్షంలో జరగాలి. ఒక వేళ అక్క‌డ షిండే గెలిచిన‌ప్ప‌టికీ పార్టీకి సంబంధించిన సంస్థాగ‌త వ్య‌వ‌హారం, సభ్యత్వం లక్షల వ‌ర‌కు ఉంది. కావున‌ నిలువునా చీలికను నిర్ధారించడం కష్టం. దీన్ని నిర్థారించ‌డం షిండే ఈజీ కాదు.

MVA సారథ్యంలోని శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిత్రపక్షాలు NCP (53), కాంగ్రెస్ (44) ఉన్నారు. మొత్తం 288 ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో ప్రస్తుత సాధారణ మెజారిటీ మార్క్ 144 మాత్ర‌మే MVA కి ఉంది. బిజెపికి సొంతంగా 106 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్ థాకరే నేతృత్వంలోని MNS, స్వాభిమాని పార్టీ, రాష్ట్రీయ సమాజ్ పక్ష్, జన్ సురాజ్య పార్టీ మరియు ఆరుగురు స్వతంత్రుల నుండి ఒక్కొక్క శాసనసభ్యుల మద్దతుతో మిత్రపక్షాలతో దాని సంఖ్య 116కి చేరుకుంది.

శివసేన మంగళవారం నాడు షిండేను అసెంబ్లీలో పార్టీ గ్రూప్ లీడర్‌గా తొలగించి, షిండే అజ్ఞాతంలోకి వెళ్లి తనకు విధేయులైన పార్టీ ఎమ్మెల్యేల బృందంతో సూరత్‌కు వెళ్లిన కొన్ని గంటల తర్వాత చౌదరిని అతని స్థానంలో నియమించింది. షిండే ప్రస్తుతం అసోంలోని గౌహతి నగరంలో సేన ఎమ్మెల్యేలు, స్వతంత్ర శాసనసభ్యులతో క్యాంప్ చేస్తున్నారు. తనకు మద్దతుగా 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పారు. ఈ నేప‌థ్యంలో విశ్వాస తీర్మానం దిశ‌గా అడుగులు వేయ‌డానికి థాక‌రే చేస్తోన్న ప్ర‌యత్నం ఎటువైపు మ‌లుపు తిప్పుతుందో చూడాలి.

Tags  

  • Maharashta
  • Maharashtra CM
  • Uddhav Thackeray

Related News

Maharashtra : మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు… సీఎంగా ఫ‌డ్న‌వీస్‌..?

Maharashtra : మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు… సీఎంగా ఫ‌డ్న‌వీస్‌..?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నుంచి ఉద్ధవ్ ఠాక్రే వైదొలగడంతో బీజేపీ శిబిరంలో సంబ‌రాలు మొద‌లైయ్యాయి. ముంబైలోని తాజ్ హోటల్ వద్ద బీజేపీ నేతలు స్వీట్లు పంచుతూ, నినాదాలు చేస్తూ కనిపించారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, స్వతంత్ర అభ్యర్థులతో కలిసి బీజేపీ మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి ఎన్నికయ్యే అవకాశాలున్నాయ

  • Uddhav Thackeray Resigns: బలపరీక్షకు ముందే సీఎం పదివికి ఉద్ధ‌వ్ థాక‌రే రాజీనామా!

    Uddhav Thackeray Resigns: బలపరీక్షకు ముందే సీఎం పదివికి ఉద్ధ‌వ్ థాక‌రే రాజీనామా!

  • Eknath Shinde: గురువారం ముంబై రానున్న శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే.. ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైందా?

    Eknath Shinde: గురువారం ముంబై రానున్న శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే.. ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైందా?

  • Maharashtra Crisis : శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు `సుప్రీం` రిలీఫ్‌

    Maharashtra Crisis : శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు `సుప్రీం` రిలీఫ్‌

  • Mrs Thackeray: రంగంలోకి సీఎం ఉద్ధవ్ భార్య.. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో చర్చలు

    Mrs Thackeray: రంగంలోకి సీఎం ఉద్ధవ్ భార్య.. రెబల్ ఎమ్మెల్యేల భార్యలతో చర్చలు

Latest News

  • Kidney Stones: కిడ్నీలో రాళ్లను న్యాచురల్ గా నివారించేందుకు బెస్ట్ టిప్స్ ఇవే!

  • Vastu Tips : విష్ణుప్రియ అపరాజితను ఈ దిక్కున పెట్టండి…ఇంట్లోకి ఐశ్వర్యం తెస్తుంది..!!

  • Reduce Pain: మందు లేకుండానే నొప్పిని తగ్గించే పనికరం.. ఈ వివరాలు తెలుసుకోండి!

  • Vastu tips : భోజనం చేసేటప్పుడు ఏవైపు కూర్చుంటే మంచిదో తెలుసా..:?

  • Sai Baba : గురువారం సాయిబాబాకు పాలాభిషేకం చేస్తే…ఆ దోషాలు తొలగిపోతాయట..!!

Trending

    • Zomato Bill: ఫుడ్ డెలివరీ మోసం.. వామ్మో ఒకేసారి ఇంత దోచేస్తున్నారా?

    • OTP విషయంలో గొడవ.. ప్యాసింజర్‌ను చంపిన ట్యాక్సీ డ్రైవర్!

    • Swiggy: డెలివరీ బాయ్ కోసం స్విగ్గీ స్వారీ!

    • Air India Alert : ఎయిర్ ఇండియా పేరుపై ఆఫర్.. అది ఫేక్ అంటూ మహారాజా క్లారిటీ!

    • Service Charge In Hotels : హోట‌ల్స్, రెస్టారెంట్లపై ఫిర్యాదుకు టోల్ ఫ్రీ 1915

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: