HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >As India Gets Its Second Space Port Rocket Startups Excited

Space Port : దేశంలో రెండో అంతరిక్ష కేంద్రం విశేషాలివీ..

Space Port : ఇప్పటికే మన దేశానికి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఒక అంతరిక్ష కేంద్రం ఉంది.

  • Author : Pasha Date : 28-02-2024 - 2:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Space Port
Space Port

Space Port : ఇప్పటికే మన దేశానికి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఒక అంతరిక్ష కేంద్రం ఉంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు మనం 95 అంతరిక్ష ప్రయోగాలను నిర్వహించాం. వాటిలో 80 విజయవంతమయ్యాయి. త్వరలోనే మనకు రెండో అంతరిక్ష కేంద్రం కూడా అందుబాటులోకి రాబోతోంది. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో నిర్మించనున్న రెండో అంతరిక్ష కేంద్రానికి (Space Port) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం శంకుస్థాపన చేశారు. మొత్తం రూ.17,300 కోట్ల విలువ కలిగిన పలు డెవలప్మెంట్ ప్రాజెక్టులను ఈసందర్భంగా ప్రధాని ప్రారంభించారు. దేశంలోనే తొలి హైడ్రోజన్ హబ్ పోర్ట్ కూడా ఈ ప్రాజెక్టుల జాబితాలో ఉండటం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join

ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వాలు తమిళనాడును విస్మరించాయి. రాష్ట్ర ప్రజలు దశాబ్దాల తరబడి డిమాండ్ చేస్తున్న ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నందుకు గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో తమిళనాడు మరింత అభివృద్ధి చెందుతుంది. మూడోసారి బీజేపీ అధికారంలోకి వచ్చాక కొత్త శక్తితో రాష్ట్రానికి తిరిగి వస్తా’’ అని తెలిపారు. తమిళనాడు పర్యటన అనంతరం మోడీ నేరుగా మహారాష్ట్రకు వెళ్లనున్నారు.

Also Read : March 1st : మార్చి 1 విడుదల.. కొత్త నెల కొత్త రూల్స్

సెకండ్ స్పేస్ స్టేషన్ విశేషాలివీ..

  • తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో రెండో అంతరిక్ష కేంద్రం నిర్మాణం రెండేళ్లలో పూర్తవుతుంది.
  • దీని నిర్మాణ వ్యయం  రూ. 986 కోట్లు.
  • భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న కులశేఖరపట్నంలోని రాకెట్ లాంచ్ ప్యాడ్ ఉపగ్రహాలను ఉంచేందుకు అనువుగా ఉంటుంది.
  • రెండో అంతరిక్ష కేంద్రాన్ని 2,350 ఎకరాలలో నిర్మిస్తారు.
  • దీనికోసం 2022 జూలై నాటికే 1950 ఎకరాల భూమిని సేకరించారు.
  • తమిళనాడు ప్రభుత్వం అదనంగా తూత్తుకుడి ప్రాంతంలో 961 హెక్టార్లకుపైగా కేటాయించింది.

Also Read : Ration Card KYC : రేపే లాస్ట్ డేట్.. ఈ-కేవైసీ చేసుకోలేదో రేషన్ కార్డు కట్

శ్రీహరికోట వర్సెస్ కులశేఖరపట్టినం 

కులశేఖరపట్టినం స్పేస్‌పోర్ట్ నుంచి ప్రయోగించే  శాటిలైట్ వాహక నౌకలు (రాకెట్లు) నేరుగా దక్షిణం వైపు ప్రయాణిస్తాయి. ఇక ఇదే సమయంలో శ్రీహరికోట నుంచి ప్రయోగించే రాకెట్లు  శ్రీలంక మీదుగా వెళ్లకుండా ఉండేందుకుగానూ ఆగ్నేయ దిశ వైపుగా దిశను మార్చుకుంటూ ఉంటాయి. కులశేఖరపట్టినం స్పేస్‌పోర్ట్ నుంచి ప్రయోగించే రాకెట్లకు ఆ పని ఉండదు. ఎందుకంటే అవి నేరుగా దక్షిణం వైపుగా దూసుకెళ్తాయి. ఫలితంగా ఇక్కడి నుంచి ప్రయోగించే శాటిలైట్ వాహక రాకెట్లకు ఇంధనం కూడా తక్కువగా కాలుతుంది. రాకెట్లు మోసుకెళ్లే పేలోడ్ సామర్థ్యం కూడా పెరుగుతుంది. అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన టర్న్ అరౌండ్ సమయం కూడా తగ్గిపోతుంది. ఈ అంతరిక్ష ప్రయోగ కేంద్రం వల్ల తమిళనాడులో ఎంతోమందికి ఉద్యోగాలు  కూడా లభించనున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • india
  • pm modi
  • Rocket Startups
  • Space Port
  • tamil nadu

Related News

PM Modi wishes Andhra Pradesh CM Chandrababu Naidu

చంద్రబాబుకు ప్రధాని మోదీ బర్త్ డే విషెస్

PM Modi : ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నేడు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ప్రధాని సోషల్ మీడియా ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. చంద్రబాబును మంచి మిత్రుడని, రాష్ట్రం కోసం నిరంతరం శ్రమించే ముఖ్యమంత్రి అని కొనియాడారు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో దూసు

  • PM Modi

    Modi Speech : ఈరోజు రాత్రి 8.30 గంటలకు మోదీ ప్రసంగం..ఏమాట్లాడబోతారో ?

  • PM Modi

    12 ఏళ్ల‌లో తొలిసారి.. అసంతృప్తి వ్య‌క్తం చేసిన పీఎం మోదీ!

  • Lok Sabha Seats

    లోక్‌సభ సీట్ల సంఖ్య 850కి పెంపు!

  • IMF Chief Kristalina Georgieva

    Kristalina Georgieva: ప్రపంచ సగటు కన్నా రెట్టింపు వృద్ధితో భారత్: ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టలినా జార్జివా

Latest News

  • IPL 2026 – SRH Vs DC : ఢిల్లీ పై 47 రన్స్ తేడాతో SRH విజయం

  • TGSRTC Strike: అర్ధరాత్రి నుండి తెలంగాణలో బస్సులు బంద్

  • IPL 2026 – SRH Vs DC : అభిషేక్ మెరుపులు..DC కి 243 టార్గెట్

  • Good News : ఏపీకి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసిన కేంద్రం

  • Telangana Govt : ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్‌న్యూస్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd