AAP Gujarat CM Candidate: నేడు గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థిని ప్రకటించనున్న కేజ్రీవాల్
- Author : Prasad
Date : 04-11-2022 - 9:20 IST
Published By : Hashtagu Telugu Desk
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేడు ఆప్ సీఎం అభ్యర్థిని ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించనున్నారు. ఇసుదాన్ గాధ్వి కానీ గోపాల్ ఇటాలియా లు ఆప్ ముఖ్యమంత్రిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. గుజరాత్‌లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొదటిది డిసెంబర్ 1న, రెండో దశ పోలింగ్ డిసెంబర్ 5న జరగనుంది. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) గురువారం తేదీలను ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో ఆప్ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి అభ్యర్థితో పాటు కేజ్రీవాల్ శనివారం నుంచి రోడ్‌షోలు నిర్వహించనున్నారకు. ఆమ్ ఆద్మీపార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రతిరోజూ రెండు మూడు రోడ్‌షోలు నిర్వహించనున్నారు.
గోపాల్ ఇటాలియా పాటిదార్ కమ్యూనిటీ నుండి వచ్చారు. ఆయన పాటిదార్ ఆందోళనలో కూడా పాల్గొన్నారు. ఇసుదాన్ గాధ్వి మాజీ జర్నలిస్ట్, ఆయన భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. అనేక హామీలను ప్రకటించడం, యాత్రలు, ఇంటింటికీ ప్రచారం చేయడం ద్వారా ఆప్ జూన్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌లకు గట్టి పోటీ ఇస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు 92 సీట్లు అవసరం అవుతుంది