Delhi CM : మీరు తిట్టినట్లు నా భార్య కూడా తిట్టదు నన్ను…కేజ్రివాల్ సెటైర్..!!
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఎల్‌జీ వీకే సక్సేనా, ఆప్ ప్రభుత్వం మధ్య రగడ జరుగుతోన్న సంగతి తెలిసిందే .
- By hashtagu Published Date - 07:10 AM, Fri - 7 October 22

ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో ఎల్‌జీ వీకే సక్సేనా, ఆప్ ప్రభుత్వం మధ్య రగడ జరుగుతోన్న సంగతి తెలిసిందే . ఎక్సైజ్, డిటిసి బస్సు, ఉచిత విద్యుత్ పథకంపై విచారణకు ఆదేశించారు. ఈ తరుణంలో ఇరువురు ఒకరిపై ఒకరూ విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా తనకు రాసిన లేఖ పట్ల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. గత ఆరు నెలల్లో లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి తనకు ఎన్నో ‘ప్రేమలేఖలు’ అందాయంటూ ఆయన చమత్కరించారు.
కాగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ని టార్గెట్ చేస్తూ గురువారం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. “ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సాహిబ్ నన్ను ప్రతిరోజూ మీరు తిట్టినంతగా, నా భార్య కూడా నన్నుకూడా తిట్టదు. గత ఆరు నెలల్లో ఎల్‌జీ సాహిబ్ నాకు రాసినన్ని ప్రేమ లేఖలు నా భార్య కూడా రాయలేదు” అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. “ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గారు.. కొంచెం శాంతించండి.. మీ సూపర్ బాస్ కు చెప్పండి… ఆయనను కూడా కొంచెం శాంతించమనండి” అంటూ కేజ్రీవాల్ చమత్కరించారు.
LG साहिब रोज़ मुझे जितना डाँटते हैं, उतना तो मेरी पत्नी भी मुझे नहीं डाँटतीं।
पिछले छः महीनों में LG साहिब ने मुझे जितने लव लेटर लिखे हैं, उतने पूरी ज़िंदगी में मेरी पत्नी ने मुझे नहीं लिखे।
LG साहिब, थोड़ा chill करो। और अपने सुपर बॉस को भी बोलो, थोड़ा chill करें।
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 6, 2022