HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Arvind Kejriwal On Majority Test To Show Bjps Op Lotus Failed

Arvind Kejriwal Majority Test: ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ విశ్వాస తీర్మానం..లెఫ్ట్ నెంట్ గ‌వ‌ర్న‌ర్ ను తొల‌గించాల‌ని డిమాండ్‌

ఇటీవ‌ల ఆప్, బిజెపి మ‌ధ్య‌ నెల‌కొన్న ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల నేప‌ధ్యంలో ఢిల్లీ అసెంబ్లీ సోమ‌వారంనాడు ప్ర‌త్యేకంగా స‌మావేశం అయింది.

  • By Hashtag U Published Date - 09:54 PM, Mon - 29 August 22
  • daily-hunt
Arvind Imresizer
Arvind Imresizer

ఇటీవ‌ల ఆప్, బిజెపి మ‌ధ్య‌ నెల‌కొన్న ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల నేప‌ధ్యంలో ఢిల్లీ అసెంబ్లీ సోమ‌వారంనాడు ప్ర‌త్యేకంగా స‌మావేశం అయింది. ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ స్పీక‌ర్ అనుమ‌తితో త‌మ ప్ర‌భుత్వంపై విశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టారు. అంత‌కు ముందు స‌భ‌లో బిజెపి స‌భ్యులు ఢిల్లీ ముఖ్యమంత్రి దొంగ‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గ‌ల‌భా సృష్టించారు. వారిని బ‌ల‌వంతంగా మార్ష‌ల్స్ స‌భ‌నుంచి పంపేశారు. బిజెపి త‌మ ప్ర‌భుత్వాన్ని కూల‌గొట్టేందుకు అనేక ప్ర‌య‌త్నాలు చేస్తోంద‌ని ముఖ్య‌మంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు.

ఆప్ ఎమ్మెల్యేలంతా త‌మ‌తోనే ఐక్యంగా ఉన్నార‌ని చెప్పేందుకే ఈ విశ్వాస ఓటును ఎదుర్కొంటున్నాన‌ని చెప్పారు. బిజెపి చేస్తున్న కుట్ర‌లు, ఢిల్లీలో ఆప‌రేష‌న్ లోట‌స్ విప‌ల‌మైంద‌ని నిరూపించ‌డానికే ఈ విశ్వాస తీర్మానం ప్ర‌వేశ‌పెట్టామ‌ని అన్నారు. ఆప్‌లోని ప్రతి ఎమ్మెల్యే, కార్యకర్త, మంత్రి నిజాయితీపరులని చూపించడానికి విశ్వాస ఓటు అవసరం. మా ఎమ్మెల్యేలను రూ.20 కోట్లకు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఒక్క ఎమ్మెల్యే కూడా అమ్ముడుపోలేదని ఢిల్లీ ప్రజలకు ఈరోజు నిరూపిస్తామ‌ని కేజ్రీవాల్ అన్నారు.

మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర , అస్సాంతో సహా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడానికి బిజెపి ఇప్పటివరకు 277 మంది ఎమ్మెల్యేలను “కొనుగోలు” చేసిందని కేజ్రీవాల్ ఆరోపించారు. రాబోయే 15 రోజుల్లో జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. ” మా ఎమ్మెల్యేల‌ను కూడా కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించింది. ఈ విశ్వాస తీర్మానం ద్వారా, ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయలేర ని ఢిల్లీ వాసులకు చూపించాలనుకున్నాం. ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి చేపట్టిన ‘ఆపరేషన్ కమలం’ విఫలమైంది.”అని ముఖ్య‌మంత్రి అన్నారు.

ఈ యేడాది ప్రారంభంలో ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన నూత‌న‌ లిక్క‌ర్ విధానంలో ముడుపులు అందాయ‌ని ఆరోపిస్తూ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీష్ సిసోడియా ఇంటిపైసిబిఐ దాడులు చేసింది. ఆయ‌న‌తో పాటు మ‌రికొంద‌రిపై కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌ద్యంలో త‌మ ఎమ్మెల్యేల‌ను పార్టీ మార్చేందుకు కోట్లాది రూపాయ‌లు ఎర చూపార‌ని ఆరోపించారు. లెఫ్ట్ నెంట్ గ‌వ‌ర్న‌ర్ ను తొల‌గించాలి.. సభలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై చర్చ సంద‌ర్భంగా ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ మాట్లాడుతూ. ఢిల్లీ ఎల్-జి వినయ్ కుమార్ సక్సేనా 1,400 కోట్ల రూపాయల ఖాదీ కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఎల్-జీ వినయ్ కుమార్ సక్సేనాపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో, ఆప్ ఎమ్మెల్యేలు ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు చేతుల్లో బ్యానర్లు, ప్లకార్డులతో త‌మ స్థానాల్లో లేచి నిలబడి నినాదాలు చేశారు. క‌డ‌ప‌టి వార్త‌లు అందేస‌రికి స‌భ‌లో ఇంకా చ‌ర్చ కొన‌సాగుతోంది.

विश्वास प्रस्ताव की ज़रूरत ये दिखाने के लिए थी कि AAP का एक-एक विधायक, एक-एक मंत्री कट्टर ईमानदार है।

ये दिखाने के लिए कि MP, Goa, Maharashtra, Karnataka आदि में इनका ऑपरेशन लोटस कामयाब हुआ लेकिन दिल्ली में आकर ये फ़ेल हो गया। pic.twitter.com/GLtmIds1Cp

— Arvind Kejriwal (@ArvindKejriwal) August 29, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • arvind kejriwal
  • delhi govt majority test
  • delhi ssembly

Related News

    Latest News

    • TVK Vijay : ప్రతి ఇంటికి బైక్ ఉండాలి – విజయ్ కోరిక

    • WhatsApp Groups Hacked : తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్

    • Kavitha: పద్మశాలీలకు అన్యాయం జరుగుతుంది – కవిత

    • Speaker Notice : స్పీకర్ నోటీసులపై స్పందించిన దానం

    • IND vs SA: దక్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌!

    Trending News

      • Terror Plot: స్కూల్‌ల పక్కనే భారీ పేలుడు పదార్థాలు: ఉగ్రవాదుల గుప్త ప్లాన్ బయటపడింది

      • Indian Skill Report 2026 : దేశంలోని 56.35% మంది పనిచేయడానికి ఇష్టపడుతోన్న మహిళలు!

      • Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!

      • Shocking Facts : జైపూర్‌లో నాలుగో తరగతి విద్యార్థిని ఆత్మ*హత్య కేసు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

      • Earthquake : బంగ్లాదేశ్‌లో 5.7 తీవ్రత భూకంపం… కోల్కతా, దక్షిణ బెంగాల్‌లో స్పష్టంగా అనుభవించిన ప్రకంపన!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd