Terror Attack : ఉగ్రదాడిలో ఇద్దరు సైనికులు మృతి
Terror Attack : ఉత్తర కశ్మీర్లోని గుల్మార్గ్ బోటాపతేర్ (Gulmarg's Botapathri) ప్రాంతంలో సైనికుల వాహనం(Army vehicle)పై ఉగ్రవాదులు దాడి చేశారు.
- By Sudheer Published Date - 10:50 PM, Thu - 24 October 24

కశ్మీర్లో ఉగ్రమూకలు మరో దాడి(Terror Attack)కి తెగబడ్డాయి. ఉత్తర కశ్మీర్లోని గుల్మార్గ్ బోటాపతేర్ (Gulmarg’s Botapathri) ప్రాంతంలో సైనికుల వాహనం(Army vehicle)పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సైనికులు మృతి చెందగా..మరో ఇద్దరు సహాయకులు మృతి చెందారు. ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ లో ఉన్న సైనిక వాహనంపై ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. గాయపడిన ఏడుగురిలో నలుగురు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై సీఎం ఒమర్ అబ్దుల్లా (CM Omar Abdullah) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బారాముల్లాలోని బుటాపత్రి ప్రాంతంలో సైనికులు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోందని వెల్లడించింది. ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు తొలుత దాడి చేశారని వివరించింది. కాగా కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్‌లో గత 72 గంటల్లో ఇది రెండవ ఉగ్రదాడి కావడం గమనార్హం.
మూడు రోజుల క్రితం జరిగిన మరో ఘోరమైన ఘటనలో, ముష్కరులు సొరంగం నిర్మాణ కార్మికుల క్యాంపుపై దాడి చేసి ఆరుగురు కార్మికులు మరియు ఒక వైద్యుడిని హతమార్చారు. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఈ దాడిని పిరికిపంద చర్యగా పేర్కొన్నారు. ఈ ఘటన అక్టోబర్ 8న జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఒమర్ అబ్దుల్లా పార్టీ విజయం సాధించిన కొద్దిరోజుల్లోనే జరగడం గమనార్హం.
Read Also : Truth Bomb : ‘ట్రూత్ బాంబ్’ తుస్సు ..ఏదన్న జగనన్న ..?