Rajasthan New CM : రాజస్థాన్‌లోనూ సీఎంగా కొత్త వ్యక్తే.. కాసేపట్లో క్లారిటీ
Rajasthan New CM : కొత్త సీఎంల ఎంపికలో బీజేపీ అధిష్టానం కొంగొత్త పుంతలు తొక్కుతోంది.
- Author : Pasha
Date : 12-12-2023 - 2:46 IST
Published By : Hashtagu Telugu Desk
Rajasthan New CM : కొత్త సీఎంల ఎంపికలో బీజేపీ అధిష్టానం కొంగొత్త పుంతలు తొక్కుతోంది. సీనియారిటీతో పాటు స్థిరత్వం, ప్రజాదరణ, విధేయత, వయసు వంటి అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుంటోంది. ఈ లెక్కన అందరినీ ఆశ్చర్యపరిచేలా ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లకు కొత్త సీఎంలను నియమించింది. మధ్యప్రదేశ్ సీఎంగా మోహన్ యాదవ్‌ను, ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణు దేవ్సాయ్ని నియమించింది. ఇక రాజస్థాన్‌లో సీఎం కాబోతున్న కొత్త ముఖం ఎవరు ? అనే దానిపై సర్వత్రా సస్పెన్స్ నెలకొంది.
We’re now on WhatsApp. Click to Join.
రాజస్థాన్‌లోని 199 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లను గెల్చుకుంది. రాజస్థాన్ సీఎం రేసులో మాజీ సీఎం వసుంధరా రాజే, దియా కుమారి, మహంత్ బాలక్‌నాథ్, కిరోడీలాల్ మీణా, గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్‌రామ్ మేఘ్వాల్, అశ్విన్ వైష్ణవ్ ఉన్నారు. అయితే వీరిలో ఒకరిని ఎంపిక చేస్తారనేది ఇంకొన్ని గంటల్లో తెలిసిపోతుంది. రాజస్థాన్‌లో కొత్త సీఎంను ఎంపిక చేసే బాధ్యతను రక్షణ మంత్రి రాజ్‌నాథ్, పార్టీ నేతలు సరోజ్‌పాండే, వినోద్ తావ్డేలకు బీజేపీ అధిష్టానం అప్పగించింది.
Also Read: 24 Killed : పాక్ ఆర్మీ బేస్‌పై ఆత్మాహుతి దాడి.. 24 మంది మృతి
జైపూర్‌లో ఇవాళ సాయంత్రం 4 గంటలకు కొత్త ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమై కొత్త సీఎం పేరును ప్రకటిస్తారు. ఈనేపథ్యంలో కొందరు బీజేపీ ఎమ్మెల్యేలు మాజీ సీఎం వసుంధరా రాజేతో భేటీ అవుతుండటం గమనార్హం. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లలో ఈవిధంగా ఎమ్మెల్యేలు మాజీ సీఎంలతో భేటీ కాలేదు. దీంతో బీజేపీ అధిష్టానం వసుంధరా రాజే వైపు అనుమానపు చూపులు చూస్తోంది. ఈనేపథ్యంలో ఆమెకు ఈసారి సీఎంగా ఛాన్స్ దక్కకపోవచ్చని అంటున్నారు. దీంతో కొత్తవారే సీఎంగా(Rajasthan New CM) ఛాన్స్ దక్కించుకుంటారనే విషయం క్లియర్ అయిపోతోంది.