Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో మరో నిందితుడు అరెస్ట్
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన మహేష్ కుమావత్‌ను శనివారం ఢిల్లీలో అరెస్టు చేశారు.
- By Praveen Aluthuru Published Date - 03:35 PM, Sat - 16 December 23

Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన మహేష్ కుమావత్‌ను శనివారం ఢిల్లీలో అరెస్టు చేశారు. ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన ఆరో నిందితుడు మహేస్ కుమావత్. ఇతర నిందితులు పన్నిన కుట్రలో ప్రధాన సూత్రధారి లలిత్ ఝా భాగస్వామి. ఇప్పటి వరకు ఢిల్లీ పోలీసులు లలిత్ ఝా, మహేష్, నీలం, సాగర్ శర్మ, మనోరంజన్, అమోల్షిండే అనే ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. తాజాగా అరెస్టయిన నిందితుడు మహేష్ కుమావత్‌ను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. .
డిసెంబర్ 13న ఇద్దరు నిందితులు లోక్‌సభలోకి ప్రవేశించి పొగ బాంబులు విసిరిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, సూత్రధారి లలిత్ ఝా సహా ఐదుగురిని ఇప్పటికే అరెస్టు చేశారు. 2001లో పార్లమెంట్‌పై దాడి జరిగిన రోజునే స్మోక్‌బాంబులతో గందరగోళం సృష్టించడంతో పార్లమెంట్‌లో భద్రత లోపంపై విపక్షాలు విరుచుకుపడ్డాయి.
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో నిందితుల రిమాండ్ రిపోర్టులో ఢిల్లీ పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. దేశంలో అరాచకం సృష్టించాలనుకుంటున్నారని, తద్వారా తమ డిమాండ్ల సాధనకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు లలిత్ ఝాకు ఏదైనా శత్రు దేశం లేదా ఉగ్రవాద సంస్థ, విదేశీ నిధులతో సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
Also Read: Medaram Maha Jatara : మహా జాతరకు రూ.75కోట్ల విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం