Amit Shah : ఒక్క పాకిస్థాన్ వాడు కూడా ఉండదు.. రాష్ట్రాలకు అమిత్ షా కీలక ఆదేశాలు..!
Amit Shah : తమ రాష్ట్రాల్లో నివసిస్తున్న లేదా తాత్కాలికంగా ఉన్న పాకిస్తాన్ పౌరుల్ని తక్షణమే గుర్తించి, బహిష్కరించాల్సిందిగా కోరారు
- By Sudheer Published Date - 04:00 PM, Fri - 25 April 25

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Jammu Kashmir Terrorist Attack) దేశవ్యాప్తంగా తీవ్ర ఉన్మాదాన్ని రేపింది. 26 మంది భారతీయ పౌరుల ప్రాణాలు కోల్పోయిన ఈ దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రవాదానికి పాకిస్తాన్ నుంచి మద్దతు లభిస్తోందన్న ఆరోపణలపై స్పందించిన కేంద్రం, ఇప్పటివరకు ఉన్న అన్ని ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షిస్తూ, పాకిస్తాన్ పౌరులపై ఆంక్షలు విధించడానికి సిద్ధమైంది.
Pahalgam Terror Attack : భారత్, పాకిస్థాన్‌లు సంయమనం పాటించాలి : ఐక్యారాజ్యసమితి
ఈ పరిణామాల్లో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తమ రాష్ట్రాల్లో నివసిస్తున్న లేదా తాత్కాలికంగా ఉన్న పాకిస్తాన్ పౌరుల్ని తక్షణమే గుర్తించి, బహిష్కరించాల్సిందిగా కోరారు. పాక్ పౌరుల గుర్తింపు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేయడంపై కేంద్రం ఇప్పటికే చర్యలు తీసుకుంది. ఏప్రిల్ 27 నుంచి అన్ని రకాల పాక్ వీసాలు రద్దుకానున్నాయి. వైద్య వీసాలకు కేవలం 48 గంటల గడువు మాత్రమే ఇచ్చారు.
అయితే, హిందూ మతానికి చెందిన పాకిస్తాన్ జాతీయులకు మాత్రం దీర్ఘకాలిక వీసాలు కొనసాగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. జాతీయ భద్రత, ప్రజల రక్షణ ప్రాధాన్యంగా తీసుకున్న ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతోంది. ఈ నిర్ణయాలు ఉగ్రవాదానికి ఎదురుగానే కాకుండా, దేశవ్యాప్తంగా భద్రతా పరిస్థితులను మరింత బలోపేతం చేయడంలో భాగంగా చేపట్టినవని అధికారులు వెల్లడించారు.