HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Amit Shah Holds Crucial Meeting Amid India Pak Tensions Ajit Doval Attends

Operation Sindoor : భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ అమిత్‌ షా కీలక భేటీ.. హాజరైన అజిత్ దోవల్

ఈ భేటీలో బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్, సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్, హోంశాఖ ఉన్నతాధికారులు, అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. సరిహద్దులు, విమానాశ్రయాలు, అంతర్గత భద్రతపై సమగ్రంగా చర్చించి, తాజా పరిస్థితులను సమీక్షించారు.

  • By Latha Suma Published Date - 01:55 PM, Fri - 9 May 25
  • daily-hunt
Amit Shah holds crucial meeting amid India-Pak tensions, Ajit Doval attends
Amit Shah holds crucial meeting amid India-Pak tensions, Ajit Doval attends

Operation Sindoor : భారత భద్రతా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్‌’ నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పాకిస్థాన్ రెచ్చగొట్టే చర్యలు కొనసాగుతుండటంతో, భారత ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను పటిష్ఠం చేసేందుకు కేంద్రం అన్ని విభాగాలను ముబ్దుగా ఉంచింది. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ఏర్పాట్లు గట్టిగా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఢిల్లీకి సమీపంలోని తన నివాసంలో అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో బీఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్, సీఐఎస్‌ఎఫ్ డైరెక్టర్ జనరల్, హోంశాఖ ఉన్నతాధికారులు, అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరయ్యారు. సరిహద్దులు, విమానాశ్రయాలు, అంతర్గత భద్రతపై సమగ్రంగా చర్చించి, తాజా పరిస్థితులను సమీక్షించారు.

Read Also: India – Pakistan War : ఉగ్రదాడుల లైవ్ ప్రసారాలపై కేంద్రం సీరియస్

ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌కు సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే కీలక చర్యలు చేపట్టాయి. పంజాబ్ సరిహద్దులో చొరబడే యత్నం చేసిన పాకిస్థాన్ వ్యక్తిని బీఎస్‌ఎఫ్ జవాన్లు హతమార్చారు. రాజస్థాన్‌లో 1,037 కిలోమీటర్ల పాకిస్థాన్ సరిహద్దును పూర్తిగా మూసివేశారు. అనుమానాస్పదంగా కనిపించే వారిని కాల్చివేయాలని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. జమ్మూ కశ్మీర్‌లోని సాంబ జిల్లా సరిహద్దులో చొరబాటు యత్నాలు జరిగిన నేపథ్యంలో బీఎస్‌ఎఫ్ అప్రమత్తమైంది. కనీసం ఏడుగురు పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు, పాకిస్థాన్ నియంత్రణ రేఖకు ఆవల నుంచి భారీ షెల్లింగ్ కొనసాగుతోంది. ముఖ్యంగా జమ్మూ, ఉరి ప్రాంతాల్లో దీని తీవ్రత ఎక్కువగా ఉంది. ఇళ్లను విడిచి వెళ్లిపోతున్న వాసుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుగానే చర్యలు తీసుకుంటూ, జాతీయ భద్రతకు పెద్దపీట వేస్తున్నాయి.

Read Also: Miss World: హైదరాబాద్‌కు మిస్‌ వరల్డ్ క్రిస్టినా .. అధికారుల ఘనస్వాగతం

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • India Pakistan Tensions
  • National Security Advisor Ajit Doval
  • Operation Sindoor
  • Union Home Minister Amit Shah

Related News

Rajnath Singh

Rajnath Singh: పాక్ చర్యలపై ఆధారపడి సిందూర్ పార్ట్ 2 మళ్లీ మొదలవొచ్చు : రాజ్‌నాథ్

ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా నిలిపివేశామని, అయితే పాక్ చర్యల ఆధారంగా సిందూర్ పార్ట్ 2, పార్ట్ 3 ప్రారంభం కావచ్చని హెచ్చరించారు.

  • Trump

    Donald Trump: “ఏడు యుద్ధాలు ఆపాను… నోబెల్ ఇవ్వాల్సిందే” – ట్రంప్ ఘనంగా

Latest News

  • ‎Papaya Juice: ఉదయాన్నే పరగడుపున బొప్పాయి జ్యూస్ తాగవచ్చా.. తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?

  • MGBS : నీట మునిగిన ఎంజీబీఎస్..తాళ్ల సాయంతో బయటకు ప్రయాణికులు

  • Musi River : మూసీ ఉగ్రరూపం..కట్టుబట్టలతో పరుగులు తీస్తున్న స్థానికులు

  • ‎Banana: అరటిపండు ఎప్పుడు తింటే మంచిది ఉదయమా లేక రాత్రినా!

  • ‎Paneer: ప్రతీ రోజు పనీర్ తింటే ఏం జరుగుతుంది.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd