HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Amazon Is Laying Off 20 Thousand Employees

Amazon : 20 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్న అమెజాన్‌

ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఖర్చుల తగ్గింపు మార్గంలో కంపెనీలు ప్రయాణిస్తున్నాయి.

  • Author : Maheswara Rao Nadella Date : 05-12-2022 - 4:20 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Amazon 20,000
Amazon 20,000

ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఖర్చుల తగ్గింపు మార్గంలో కంపెనీలు ప్రయాణిస్తున్నాయి. తాజాగా అమెజాన్‌ (Amazon) కంపెనీ దాదాపు 20,000 మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో అమెజాన్‌ కంపెనీ తొలగిస్తున్నట్లు ప్రకటించిన సంఖ్య కంటే ఇది దాదాపు రెండు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. అమెజాన్ అనేక ప్రాంతాలలో డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ వర్కర్లు, టెక్నాలజీ స్టాఫ్‌, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లను తొలగించనున్నట్లు సమాచారం. రాబోయే నెలల్లో ఈ లేఆఫ్స్‌ ఉంటాయని, కొన్ని సోర్సెస్‌ ద్వారా కంప్యూటర్ వరల్డ్‌కి తెలిసింది.

ముందస్తు అంచనాలకు రెండు రెట్లు

అమెజాన్‌ వర్క్‌ ఫోర్స్‌ను తగ్గించడం ఆశ్చర్యపడాల్సిన అంశం కాదు. అమెజాన్ CEO ఆండీ జాస్సీ ఇటీవల అమెజాన్ అనేక విభాగాలలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోందని ధృవీకరించారు. అయితే ఎంత మందిపై ప్రభావం ఉంటుందనే వివరాలను ఆయన వెల్లడించలేదు. నవంబర్‌లో 10,000 మంది ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యోచిస్తోందని కొన్ని అంతర్గత వర్గాలు న్యూయార్క్ టైమ్స్‌ కి తెలిపాయి. ఇప్పుడు తొలగించే ఉద్యోగుల సంఖ్య పెరిగిందని, సీనియర్ మోస్ట్ స్థానాల్లో ఉన్న వారి సహా అన్ని స్థాయిలలోని వ్యక్తులను తొలగించాలని అమెజాన్ యోచిస్తోందని తాజా నివేదిక పేర్కొంది. అమెజాన్ దాదాపు 20,000 మంది తొలగింపు ప్రక్రియను ప్రారంభించే విధంగా, ఉద్యోగుల పని పనితీరును అంచనా వేయమని కంపెనీ నిర్వాహకులకు సూచించినట్లు సమాచారం.

వర్క్‌ ఫోర్స్‌లో 1.3% పై వేటు

ఇ-కామర్స్ దిగ్గజం 6% కార్పొరేట్ సిబ్బందిని, అమెజాన్ 1.5 మిలియన్ల వర్క్‌ ఫోర్స్‌లో దాదాపు 1.3% మందిని తొలగించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, గంటల వారీగా పనిచేసే వర్కర్స్‌ కూడా ఉన్నారు. ప్రభావిత ఉద్యోగులకు 24 గంటల నోటీసుతో పాటు వేతనం కూడా అందజేస్తారని, కార్పొరేట్ సిబ్బంది ఇప్పటికే అప్రమత్తమయ్యారని సోర్సెస్‌ పేర్కొంటున్నాయి. వార్తలు బయటకు రావడంతో కంపెనీలోని ఉద్యోగులలో ఆందోళన నెలకొందని కొందరు కంప్యూటర్ వరల్డ్‌కి తెలిపారు. ఏ విభాగంలో తొలగింపులు ఉంటాయనే స్పష్టత, సమాచారం లేదని అన్ని విభాగాల్లోనూ తొలగింపులకు ఆస్కారం ఉందని చెబుతున్నారు. కరోనా సమయంలో అధిక నియమాలు, కంపెనీ ఆర్థిక పరిస్థితులు క్షీణిస్తున్న కారణాలతో ఖర్చు తగ్గించాల్సిన అవసరం ఏర్పడిందని సోర్సెస్‌ తెలిపాయి.

ముందస్తుగా తెలియజేస్తాం: అమెజాన్‌ (Amazon)  సీఈవో

అంతకు ముందు అమెజాన్‌ సీఈవో ఓ ప్రకటనలో తొలగింపు ప్రక్రియ కొన్ని నెలల పాటు కొనసాగుతుందని, కంపెనీ ప్రతి ఒక్కటీ అంచనా వేసిన తర్వాత సంబంధిత ఉద్యోగులకు తెలియజేస్తుందని ప్రకటించారు. కాబట్టి ఖర్చును ఆదా చేసేందుకు అన్ని ప్రాంతాల్లోని అన్ని విభాగాలను సమీక్షించి ఉంటారని, అందుకే తొలగింపుల సంఖ్య పెరిగిందని భావిస్తున్నారు. మా వార్షిక ప్రణాళిక ప్రక్రియ కొత్త సంవత్సరం వరకు విస్తరించి ఉంటుందని, లీడ్స్‌ అడ్జస్ట్‌మెంట్‌లను చేస్తూనే ఉన్నారని, మరింత మంది ఉద్యోగులను తగ్గించే అవకాశం ఉందని ఆండీ అన్నారు. ఆ నిర్ణయాలను 2023 ప్రారంభంలో సంబంధిత ఉద్యోగులు, సంస్థలతో పంచుకొంటామని చెప్పారు. ఎంత మందిని తొలగించే అవకాశం ఉందనే అంశాలపై ఇంకా ఓ స్పష్టతకు రాలేదన్నారు. కానీ ప్రతి ఉద్యోగికి ముందస్తుగా సమాచారం అందిస్తామని పేర్కొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 20000
  • amazon
  • employees
  • jobs
  • Speed News

Related News

Holi Stoe

Amazon : ఏఐ (AI) హంగులతో అమెజాన్ ‘హోలీ స్టోర్’ ప్రారంభం

ఈ పండుగ సీజన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత షాపింగ్ అనుభవాన్ని పరిచయం చేసింది. పండుగకు కావాల్సిన ఫ్యాషన్, సౌందర్య సాధనాలు, గృహాలంకరణ, మరియు సేఫ్ ఆర్గానిక్ రంగుల వంటి విస్తృత శ్రేణి ఉత్పత్తులను ఒకే చోట చేర్చడమే కాకుండా

  • Railway Jobs Quota For Fire

    Jobs : అగ్నివీర్లు, మాజీ సైనికులకు రైల్వే జాబ్స్ కోటా

  • Amazon 'protein Week'

    Amazon : ప్రపంచ ప్రొటీన్ దినోత్సవం సందర్భంగా ‘ప్రొటీన్ వారోత్సవానికి’ అమెజాన్ శ్రీకారం

  • Supreme Court

    కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్ర‌హం.. కార‌ణ‌మిదే?!

Latest News

  • Blenders Pride : బ్లెండర్స్ ప్రైడ్ నుండి ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్

  • Escorts Kubota Limited : దక్షిణాది రైతుల కోసం ఎస్కార్ట్స్ కుబోటా సరికొత్త ట్రాక్టర్ విడుదల

  • సోషల్ మీడియా క్రియేటర్ల శ్రమను దోచుకుంటున్నారు: విజయసాయిరెడ్డి

  • Mini Maldives : తెలంగాణలో మినీ మాల్దీవులు ఉన్నాయని మీకు తెలుసా ?

  • ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ఆపాలి.. చైనా వార్నింగ్ !

Trending News

    • ఇరాన్‌ లో ఓ వైపు యుద్ధం, మరోవైపు భూకంపం

    • శబరిమలలో మహిళలకు నో ఎంట్రీ

    • ఖమేనీ వద్ద ఎంత ఆస్తి ఉందో తెలుసా?

    • రోహిత్-విరాట్ టీమ్ ఇండియా జెర్సీలో ఎప్పుడు క‌నిపించ‌నున్నారు?

    • భార‌త్ సెమీస్ చేరాలంటే.. ఎన్ని ప‌రుగుల తేడాతో గెల‌వాలో తెలుసా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd