Business Ideas: 30 వేల రూపాయల పెట్టుబడితో ఈ బిజినెస్ ప్రారంభించండి.. యేటా 30 లక్షల రూపాయలు సంపాదించండి..!
ఈరోజుల్లో చాలా మంది ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయం కోసం సైడ్ బిజినెస్ (Business Ideas)గా రకరకాల పనులు చేస్తుంటారు. మీరు కూడా అలాంటిదే ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మేము మీకు గొప్ప వ్యాపార ఆలోచనను అందిస్తున్నాము.
- By Gopichand Published Date - 05:42 PM, Sun - 30 April 23
Business Ideas: ఈరోజుల్లో చాలా మంది ఉద్యోగంతో పాటు అదనపు ఆదాయం కోసం సైడ్ బిజినెస్ (Business Ideas)గా రకరకాల పనులు చేస్తుంటారు. మీరు కూడా అలాంటిదే ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నట్లయితే మేము మీకు గొప్ప వ్యాపార ఆలోచనను అందిస్తున్నాము. ఈ వ్యాపారం (Business)లో మీరు తక్కువ ఖర్చుతో పెట్టుబడి పెట్టడం ద్వారా మూడు రెట్లు ఎక్కువ లాభం పొందవచ్చు. ఈ వ్యాపారంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మీరు దాని కోసం ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. కేవలం 25 నుంచి 30 వేల రూపాయల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
ఇక్కడ ముత్యాల పెంపకం వ్యాపారం గురించి మాట్లాడుతున్నాము. ఈ వ్యాపారం కోసం ప్రభుత్వం 50 శాతం వరకు సబ్సిడీని కూడా ఇస్తుంది. ఈ వ్యాపారంలో మీరు చాలా తక్కువ ఖర్చుతో కూడా ప్రతి నెలా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ప్రస్తుతం ముత్యాల పెంపకం వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతోంది.
ముత్యాల పెంపకం ఎలా ప్రారంభించాలి..?
ముత్యాల సాగు కోసం మీకు చెరువు అవసర పడుతుంది. అదే సమయంలో ఈ వ్యాపారం కోసం మీకు మొదట శిక్షణ కూడా అవసరం. కావాలంటే సొంత ఖర్చులతో చెరువు తవ్వించుకోవచ్చు. ప్రభుత్వం నుంచి సబ్సిడీ సాయం కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం ప్రభుత్వం 50 శాతం సబ్సిడీని అందిస్తుంది. ముత్యాలు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో కనిపిస్తాయి. కానీ మంచి నాణ్యమైన ముత్యాలు దక్షిణ భారతదేశం, బీహార్లోని దర్భంగాలో లభిస్తాయి. మరోవైపు మీరు ఈ వ్యాపారం కోసం శిక్షణ తీసుకోవాలనుకుంటే, మీరు మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో శిక్షణ తీసుకోవచ్చు. మధ్యప్రదేశ్లోని హోసంగాబాద్, ముంబైలలో ముత్యాల పెంపకానికి శిక్షణ ఇస్తున్నారు.
ఇది ముత్యాలు చేసే ప్రక్రియ
ముత్యాల పెంపకం కోసం ముత్యాలను మొదట నెట్లో కట్టి 10-15 రోజులు చెరువులో వేస్తారు. తద్వారా వారు తమ వాతావరణాన్ని సృష్టించుకుంటారు. ఆ తర్వాత వారిని బయటకు తీసి శస్త్రచికిత్స చేస్తారు. శస్త్రచికిత్స అంటే ఓస్టెర్ లోపల ఒక కణం లేదా అచ్చు చొప్పించబడింది. ఈ అచ్చుపై పూత పూసిన తర్వాత, ఓస్టెర్ పొరను తయారు చేస్తారు. అది తర్వాత ముత్యంగా మారుతుంది.
లక్షల్లో సంపాదిస్తారు
ముత్యాల వ్యాపారంలో సంపాదనను పరిశీలిస్తే 500 ముత్యాలు సిద్ధం చేసేందుకు దాదాపు 25 నుంచి 35 వేల రూపాయలు ఖర్చవుతుంది. తయారీ తరువాత ఒక ముత్యం నుండి రెండు ముత్యాలు వస్తాయి. ఒక ముత్యాన్ని కనీసం 120 రూపాయలకు విక్రయిస్తారు. నాణ్యత బాగుంటే రూ.200కు పైగా విక్రయిస్తున్నారు. ఒక ఎకరం చెరువులో 25 వేల మక్కలు వేస్తే దాదాపు రూ.8 లక్షలు ఖర్చవుతుంది. తయారీ సమయంలో కొన్ని ముత్యాలు వృధా అయినా 50 శాతానికి పైగా ముత్యాలు సురక్షితంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. దీనితో మీరు ఏటా 30 లక్షల రూపాయలు సులభంగా సంపాదించవచ్చు.
Related News
ATM Cash Withdrawal: ఏటీఎం నుండి నకిలీ లేదా చిరిగిపోయిన నోట్లు వస్తే ఏం చేయాలో తెలుసా.?
ఏటీఎం నుండి డబ్బు విత్ డ్రా చేయడానికి చాలా నియమాలు ఉన్నాయని మీకు తెలుసా..? ప్రతి నెలా కొన్ని పరిమితులు ఉంటాయి.