Ajit Pawar Jail: అజిత్ పవార్ జైలుకే
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో అజిత్ పవార్ తిరుగుబాటు చేసినప్పటి నుండి మాజీ ఎంపీ షాలినితాయ్ పాటిల్ అజిత్ పవార్‌పై నిరంతరం విమర్శలు చేస్తూనే ఉన్నారు
- Author : Praveen Aluthuru
Date : 26-12-2023 - 4:15 IST
Published By : Hashtagu Telugu Desk
Ajit Pawar Jail: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో అజిత్ పవార్ తిరుగుబాటు చేసినప్పటి నుండి మాజీ ఎంపీ షాలినితాయ్ పాటిల్ అజిత్ పవార్‌పై నిరంతరం విమర్శలు చేస్తూనే ఉన్నారు. అజిత్ పవార్‌పై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత వసంతదాదా పాటిల్ భార్య షాలినితాయ్ పాటిల్ మరోసారి విరుచుకుపడ్డారు. మరో నాలుగు నెలల్లో అజిత్ పవార్ జైలుకు వెళ్లడం ఖాయమని పాటిల్ పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారని పాటిల్ అన్నారు.
అజిత్ పవార్ ముఖ్యమంత్రి కావడానికి బీజేపీతో కలిసి వెళ్లారు. ఇదేంటని షాలినితాయిని ప్రశ్నించగా.. జైలుకు వెళ్లిన వ్యక్తి ఎన్నికల్లో నిలబడలేడన్నారు. మరో నాలుగు నెలల్లో అజిత్ పవార్ జైలుకు వెళ్లనున్నారు. కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. అజిత్ పవార్ జైలుకు వెళ్లినప్పుడు ఆయన్ను కలవడానికి కూడా ఎవరూ వెళ్లరని ఆమె సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
Also Read: Corona Cases: భారతదేశంలో 412 తాజా కరోనా కేసులు నమోదు