IAF Chief : భారత వాయుసేన తదుపరి చీఫ్‌గా అమర్‌ప్రీత్ సింగ్ : రక్షణశాఖ
ప్రస్తుతం వాయుసేన అధిపతిగా(IAF Chief) వ్యవహరిస్తున్న మార్షల్ వివేక్ రామ్ చౌదరి పదవీ కాలం త్వరలోనే ముగియనున్నందున ఈవిషయంపై రక్షణశాఖ ప్రకటన విడుదల చేసింది.
- By Pasha Published Date - 04:32 PM, Sat - 21 September 24

IAF Chief : ఎయిర్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్‌ను భారత వాయుసేన తదుపరి అధిపతిగా నియమిస్తున్నట్లు రక్షణశాఖ ప్రకటించింది. ఈనెల 30న వాయుసేన చీఫ్‌గా ఆయన బాధ్యతలు చేపడతారని తెలిపింది. ప్రస్తుతం వాయుసేన అధిపతిగా(IAF Chief) వ్యవహరిస్తున్న మార్షల్ వివేక్ రామ్ చౌదరి పదవీ కాలం త్వరలోనే ముగియనున్నందున ఈవిషయంపై రక్షణశాఖ ప్రకటన విడుదల చేసింది.
Also Read :Polar Bear : ధ్రువపు ఎలుగుబంటు.. ఓ బామ్మ.. పోలీసులు.. ఏమైందంటే.. ?
- త్వరలో వాయుసేన చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న అమర్ ప్రీత్ సింగ్ 1964 అక్టోబరు 27న జన్మించారు.
- ఆయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ నేషనల్ డిఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
- 1984 డిసెంబర్‌లో భారత వాయుసేనలోకి ప్రవేశించారు.
- గ నాలుగు దశాబ్దాల కెరీర్‌లో వాయుసేనలో ఆయన అనేక కీలక పదవులను చేపట్టారు.
- సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్‌లో ఎయిర్ డిఫెన్స్ కమాండర్‌గా, ఈస్టర్న్ ఎయిర్ కమాండ్‌లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్‌గా గతంలో సేవలు అందించిన అనుభవం ఆయన సొంతం.
- ఎయిర్ మార్షల్ యుద్ధ స్క్వాడ్రన్, ఫ్రంట్‌లైన్ ఎయిర్ బేస్‌కు ఆయన నాయకత్వం వహించారు.
- నేషనల్ ఫ్లైట్ టెస్ట్ సెంటర్‌లో ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఫ్లైట్ టెస్ట్)గా సైతం అమర్ ప్రీత్ పనిచేశారు.
- మాస్కోలో మిగ్-29 అప్‌గ్రేడ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ బృందానికి ఆయన నాయకత్వం వహించారు.
- స్వదేశీ యుద్ధ విమానం తేజస్ టెస్టింగ్‌ను ఈయనే పర్యవేక్షించారు.
- అనుభవజ్ఞుడైన ఫ్లయర్‌గా, ప్రయోగాత్మక టెస్ట్ పైలట్‌గా అమర్ ప్రీత్ సింగ్ పేరు తెచ్చుకున్నారు.
Also Read :Lebanon Pager Blasts : లెబనాన్‌లో పేజర్లు పేలిన కేసులో కేరళవాసి పేరు.. ఏం చేశాడంటే.. ?
ఇటీవలే పెద్ద ప్రమాదం..
ఇటీవలే బీఎస్ఎఫ్‌కు చెందిన బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భద్రత కోసం వెళ్తున్న బీఎస్ఎఫ్ కాన్వాయ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం 7 బస్సులు కాన్వాయ్‌గా బయలుదేరగా మార్గం మధ్యలో బ్రెల్ గ్రామం వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న 40 అడుగుల లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో ఆ బస్సులో మొత్తం 35 మంది జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది.