Kolkata Trainee Doctor : కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో కొత్త ట్విస్ట్
ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టంకు సంబంధించిన రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయని నెటిజన్లు కోడై కూస్తున్నాయి
- By Sudheer Published Date - 07:13 PM, Sat - 17 August 24

కోల్‌కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ (Kolkata Trainee Doctor) హత్యాచార ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటన లో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. వైద్య సిబ్బంది మాత్రమే కాదు రాజకీయ పార్టీలు, పలు సేవ ట్రస్ట్ లు , మహిళా సంఘాలు , విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారు రోడ్ ఫై కి వచ్చి న్యాయం చేయాలనీ..నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టంకు సంబంధించిన రిపోర్టులో కీలక విషయాలు వెలుగుచూశాయని నెటిజన్లు కోడై కూస్తున్నారు. ఆ ట్రైనీ డాక్టర్‌పై గ్యాంగ్ రేప్ జరిగిందని.. ఆమె ఎముకలు విరిగిపోయాయని.. ఇక మరీ ముఖ్యంగా ఆమె శరీరంలో 150 మిల్లీ గ్రాముల వీర్యం ఉందని రకరకాల ఊహాగానాలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయాలు వైరల్ కావడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వెల్లువెత్తేలా చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రచారం ఫై కోల్‌కతా పోలీసులు స్పందించారు. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. అనవసర వార్తలు విని.. జనం ఆగ్రహానికి గురికావద్దని సూచించారు.
కోల్‌కతాలోని ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఈనెల 8 వ తేదీన 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ రాత్రి విధుల్లో ఉన్నారు. ఆ మరుసటి రోజు ఉదయం సెమినార్ హాల్‌లో ఆమె అర్ధనగ్న స్థితిలో విగతజీవిగా కనిపించారు. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా పోలీసులు నిందితుడైన సంజయ్ రాయ్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ కేసును కోల్‌కతా హైకోర్టు సీబీఐకి బదిలీ చేసింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.
Read Also : Revanth Reddy : అతి త్వరలో రేవంత్ తన టీం తో కలిసి బీజేపీలో చేరబోతున్నారు – కేటీఆర్