GangWar: గ్యాంగ్ వార్ లో ప్రాణాలు కోల్పోయిన కుక్కపిల్లలు…!
గ్యాంగ్ వార్ లో 80 కుక్కపిల్లలు మరణించాయి. గ్యాంగ్ వార్ అంటే మనుషుల మధ్యే కాదు జంతువుల మధ్య కూడా జరుగుతుంది.
- By Hashtag U Published Date - 11:04 PM, Sat - 18 December 21

అవును మీరు చదివింది కరెక్టే…గ్యాంగ్ వార్ లో 80 కుక్కపిల్లలు మరణించాయి. గ్యాంగ్ వార్ అంటే మనుషుల మధ్యే కాదు జంతువుల మధ్య కూడా జరుగుతుంది.మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో కోతులు, వీధి కుక్కల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఈ వార్ లో కుక్కపిల్లలు ప్రాణాలు కోల్పోయాయి.మజల్‌గావ్‌లోని కోతులు గత మూడు నెలలుగా దాదాపు 80 కుక్కపిల్లలను చంపాయని ఇక్కడి స్థానికులు తెలిపారు. కొన్ని వీధికుక్కలు ఆ ప్రాంతంలో కోతిని చంపిన తర్వాత ఈ ప్రతీకార చర్య ప్రారంభమైందని స్థానికులు చెబుతున్నారు. అప్పటి నుంచి కోతులు కుక్కపిల్లలను ఎత్తుకెళ్లి చెట్టుపై నుంచి లేదా ఎత్తైన భవనంపై నుంచి విసిరేస్తున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు.
మజల్‌గావ్‌లోని లావూల్ అనే గ్రామం సుమారు 5,000 మంది జనాభాను కలిగి ఉంది. అయితే ఈ గ్రామంలో ఇప్పుడు ఒక్క కుక్క పిల్ల కూడా లేదు. లావూల్‌లో కోతుల ప్రవర్తన గ్రామస్తులను భయభ్రాంతులకు గురి చేసింది. కోతుల మంద గ్రామంలోకి ప్రవేశించి కుక్కపిల్లలపై దాడి చేస్తుందని వారు తెలిపారు.కోతుల బెడద నుంచి కాపాడాలని స్థానికులంతా అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు, స్థానిక పోలీసుల సహాయంతో గ్రామాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న చాలా కోతులను పట్టుకోగలిగారు. గ్రామస్థులు కూడా కుక్కపిల్లలను రక్షించడానికి ప్రయత్నించారు. అయితే కోతులు ప్రతీకారంగా వాటిపై దాడి చేశాయి.కుక్కపిల్లలను కాపాడాటానికి వెళ్లిన స్థానికులకు కూడా గాయాలైనట్లు తెలిపారు.
బీడ్‌లోని కోతులు ఇప్పుడు పాఠశాలకు వెళ్లే పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించాయి.దీంతో గ్రామస్తులలు భయాందోళనలో ఉన్నారు. పిల్లలు పాఠశాలలకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. మిగిలిన కోతులను కూడా గ్రామం నుంచి పట్టుకెళ్లాలని అటవీశాఖ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.
Maharashtra | 2 monkeys involved in the killing of many puppies have been captured by a Nagpur Forest Dept team in Beed, earlier today. Both the monkeys are being shifted to Nagpur to be released in a nearby forest: Sachin Kand, Beed Forest Officer pic.twitter.com/3fBzCj273p
— ANI (@ANI) December 18, 2021