HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >75 9 Crore Active Internet Users

Active Internet Users: 75.9 కోట్ల యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్

తొలిసారిగా మన దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది (75.9 కోట్ల మంది) యాక్టివ్ ఇంటర్నెట్ (Internet) వినియోగదారులు ఉన్నట్లు తేలింది.

  • Author : Maheswara Rao Nadella Date : 04-05-2023 - 8:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
75.9 Crore Active Internet Users
75.9 Crore Active Internet Users

Active Internet Users : తొలిసారిగా మన దేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది (75.9 కోట్ల మంది) యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నట్లు తేలింది. వీరంతా కనీసం నెలకు ఒకసారి ఇంటర్నెట్‌ను (Internet) యాక్సెస్ చేస్తున్నారని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) , మార్కెట్ డేటా అనలిటిక్స్ సంస్థ కాంటార్ లు బుధవారం సంయుక్త నివేదికను విడుదల చేశాయి. దీని ప్రకారం.. భారతదేశంలో క్రియాశీల ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 2025 సంవత్సరం నాటికి 90 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతమున్న 75.9 కోట్ల మంది యాక్టివ్ ఇంటర్నెట్ వినియోగదారులలో 39.9 కోట్ల మంది గ్రామీణ ప్రాంతాలవారు కాగా , 36 కోట్ల మంది పట్టణాల వారని తేలింది. గత ఏడాది వ్యవధిలో ఇంటర్నెట్ వినియోగం రూరల్ ప్రాంతాల్లో 14 శాతం పెరగగా.. పట్టణాల్లో 6 శాతమే వృద్ధిని సాధించింది.

బీహార్‌ జనాభాలో 32 శాతం మందే ఇంటర్నెట్ (Internet) వినియోగదారులు ఉండగా.. గోవా జనాభాలో అత్యధికంగా 70 శాతం మంది ప్రజలు ఇంటర్నెట్ వాడుతున్నారు. మొత్తం ఇంటర్నెట్ యూజర్స్ లో 54 శాతం మంది పురుషులే ఉన్నారు. అయితే 2022లో కొత్తగా ఇంటర్నెట్ వినియోగం ప్రారంభించిన వారిలో 57 శాతం మంది మహిళలే ఉండటం గమనార్హం. 2025 నాటికి మొత్తం కొత్త వినియోగదారులలో 65 శాతం మంది మహిళలే ఉంటారని అంచనా. ఇక డిజిటల్ చెల్లింపులు చేసే వారి సంఖ్య 2021లో 13 శాతం పెరిగి 33.8 కోట్లకు పెరిగింది. వారిలో 36 శాతం మంది గ్రామీణులే. డిజిటల్ చెల్లింపులు చేసే మొత్తం వినియోగదారులలో 99 శాతం మంది UPI వినియోగదారులేనని నివేదిక స్పష్టం చేసింది.

Also Read:  Karnataka Elections: కర్ణాటకలో ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న బ్రహ్మానందం.. ఫొటోస్ వైరల్?


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Active users
  • Huge
  • india
  • internet
  • Statistic
  • TRAI
  • usage
  • Users

Related News

    Latest News

    • Rashmi Gautam: మోదీపై రష్మీ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు

    • Diabetes: ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? శరీరంలో వచ్చే మార్పులు ఇవే…

    • Trisha: ప్రేమ‌కు కృత‌జ్ఞ‌త‌లు.. త్రిష పోస్ట్ వైరల్..!

    • Nara Lokesh: సింగపూర్ పర్యటనలో మంత్రి నారా లోకేశ్‌

    • PM Modi: బంగారం కొనొద్దు.. అసలు కారణాలు ఏంటో తెలుసా…?

    Trending News

      • TVK విజయ్‌ అను నేను..

      • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

      • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

      • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

      • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd