Karnataka Elections: కర్ణాటకలో ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తున్న బ్రహ్మానందం.. ఫొటోస్ వైరల్?
కర్ణాటకలో ఎన్నికలు వేడి వేడిగా సాగుతున్నాయి. ఆయా పార్టీలు ప్రత్యర్థులపై గెలవడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇంకొందరు రాజకీయ నాయకులు అవి
- Author : Anshu
Date : 04-05-2023 - 7:24 IST
Published By : Hashtagu Telugu Desk
కర్ణాటకలో ఎన్నికలు వేడి వేడిగా సాగుతున్నాయి. ఆయా పార్టీలు ప్రత్యర్థులపై గెలవడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. ఇంకొందరు రాజకీయ నాయకులు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పి ఓట్లు వేసి గెలిపించమని అడుగుతున్నారు. ఇక మామూలుగా ఎన్నికల సమయంలో సినీ తారలు మెడవడం అన్నది సర్వసాధారణమే. కాగా ఇప్పటికే కన్నడలో సినీ తారలు ప్రత్యక్షంగా పరోక్షంగా వారు సపోర్ట్ చేస్తున్న పార్టీలకు సహాయపడుతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా టాలీవుడ్ స్టార్ కమెడియన్ హాస్యనటుడు బ్రహ్మానందం కన్నడ రాజకీయాలలోకి దిగారు.
ఈ నేపథ్యంలోనే బిజెపి తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చిక్ బళ్లాపూర్ బీజేపీ అభ్యర్థి సుధాకర్ కి మద్దతు పలుకుతూ తాజాగా చిక్ బళ్లా పూర్ ప్రజలతో సందడి చేశారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ సుధాకర్ ను గెలిపించాలి అని ప్రచారం చేశారు బ్రహ్మానందం. కాగా చిక్ బళ్లాపూర్ నియోజకవర్గంలో చాలావరకు తెలుగు వారే ఉండడంతో తెలుగులో మాట్లాడారు బ్రహ్మానందం. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వైద్య శాఖలో ఎంతో మంచి పేరు తెచ్చుకున్న సుధాకర్ కు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. ఎన్నో వైద్య సేవలు అందించి l కర్ణాటక గురించి దేశమంతటా మాట్లాడుకునేలా చేసిన సుధాకర్ కు ఓటు వేసి గెలిపించండి అని తెలిపారు బ్రహ్మానందం.

Karnataka Election
ఆయనకు ఉన్న మంచితనం సేవలు చూసి మా లాంటి వారందరూ ఆయనకు అండగా నిలబడడానికి గెలిపించడానికి వచ్చాము ఆయనకు ఓటు వేసి గెలిపించండి అని చెప్పుకొచ్చారు బ్రహ్మానందం. నేడు రాత్రి పది గంటల వరకు బ్రహ్మానందం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అనంతరం తిరిగి హైదరాబాదుకు చేరుకొని ఉన్నారు. బ్రహ్మానందాన్ని చూసిన అభిమానులు పెద్ద ఎత్తున సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అయితే ఎప్పుడు ఏ పార్టీ తరఫున ప్రచారం చేయని బ్రహ్మానందం ఇలా కర్ణాటక కు వెళ్లి బిజెపి తరఫున బిజెపి అభ్యర్థికి ప్రచారం చేయడం ఏంటి అని అభిమానులు చర్చించుకుంటున్నారు. గతంలో కూడా 2019 కర్ణాటక ఎలక్షన్స్ క్యాంపియంలో పాల్గొన్నారు. అప్పుడు కూడా సుధాకర్ను గెలిపించమంటూ ఆయన ప్రచారం చేశారు.