HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >600 Devotees Stuck In The Sea After Going For Holy Bath

600 Devotees: బంగాళాఖాతంలో చిక్కుకున్న 600 మంది భక్తులు

గంగాసాగర్‌లో పుణ్యస్నానానికి వెళ్లిన భక్తులు బంగాళాఖాతంలో చిక్కుకున్నారు. అలా రాత్రంతా అక్కడే గడిపారు. వారిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన దాదాపు 600 మంది భక్తులు (600 Devotees) 24 పరగణాల జిల్లా గంగాసాగర్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు.

  • Author : Gopi Date : 17-01-2023 - 11:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
600 People
Resizeimagesize (1280 X 720) (2) 11zon

గంగాసాగర్‌లో పుణ్యస్నానానికి వెళ్లిన భక్తులు బంగాళాఖాతంలో చిక్కుకున్నారు. అలా రాత్రంతా అక్కడే గడిపారు. వారిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన దాదాపు 600 మంది భక్తులు (600 Devotees) 24 పరగణాల జిల్లా గంగాసాగర్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సమయంలో దట్టమైన పొగమంచు, గాలి కారణంగా బంగాళాఖాతంలో రెండు పడవలు కూడా బురదలో కూరుకుపోయాయి. దీంతో యాత్రికులు రాత్రంతా సముద్రంలో గడపాల్సి వచ్చింది.

కాక్‌ద్వీప్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. భక్తులందరికీ రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టారు. కోస్ట్ గార్డ్ సిబ్బందిని రంగంలోకి దింపామని.. సాయం కోసం హోవర్ క్రాఫ్ట్ ను కూడా పంపామని వివరించారు. హుగ్లీ నది-బంగాళాఖాతం సంగమం దగ్గర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు దాదాపు 500 నుంచి 600 మంది భక్తులు రెండు పడవల్లో వెళ్లినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది.

Also Read: Jr NTR Met India cricketers: టీమిండియా క్రికెటర్లను కలిసిన జూ. ఎన్టీఆర్

పొగమంచు, సముద్రం ఉప్పొంగడంతో నీరు తగ్గి రెండు ఫెర్రీలు బురదలో కూరుకుపోయాయి. కాగా.. సమాచారం అందిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. యాత్రికులకు ఆహారంతోపాటు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించాలని అధికారులకు పలు ఆదేశాలు జారీ చేసింది. పొగమంచు కారణంగా గంగాసాగర్ నుంచి యాత్రికులను తీసుకురావడానికి అంతరాయం ఏర్పడుతుందని చెబుతున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా దాదాపు 10 లక్షల మంది భక్తులు గంగాసాగర్‌లో స్నానాలు చేశారు. దాదాపు 51 లక్షల మంది గంగాసాగర్‌ను సందర్శించి పూజలు చేశారు. ఇక్కడ పుణ్యస్నానం చేస్తే పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 600 Devotees
  • bay of bengal
  • Coast Gaurd
  • Gangasagar
  • West Bengal

Related News

Mamata Banerjee's Own Party MLAs Deliver a Shock

Mamata Banerjee: మమతా బెనర్జీ కు షాకిచ్చిన సొంత పార్టీ ఎమ్మెల్యేలు

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో ఓటమి తర్వాత తీవ్ర సంక్షోభంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్‌కు (టీఎంసీ) మరో ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసిన కీలక సమావేశం అనూహ్యంగా రద్దయింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేలకు గాను 20 మంది మాత్రమే హాజరుకావడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీప

  • west bengal

    BJP : సువేందు అధికారి కేబినెట్‌లో 35 కొత్త ముఖాలు.. 41కి చేరిన మంత్రివర్గ బలం

Latest News

  • Weather Alert: తెలంగాణలో భారీ వర్షాలు

  • KTR: పవన్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Sleep Disturbance: నిద్రలో ఎక్కువ సార్లు మేల్కుంటున్నారా.. ఇది మీకోసమే..!

  • Pooja Hegde: సినిమాలపై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్స్

  • Tiger Attack: పోలవరం లో పెద్ద పులి బీభత్సం

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd