Aryabhata 50 Years : భారత్ తొలి ఉపగ్రహం ఆర్యభట్టకు 50 ఏళ్లు.. చారిత్రక విశేషాలివీ
5వ శతాబ్దానికి చెందిన ప్రముఖ గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట(Aryabhata 50 Years) పేరును భారత్ తొలి శాటిలైట్‌కు పెట్టారు.
- By Pasha Published Date - 12:40 PM, Sat - 19 April 25

Aryabhata 50 Years : సరిగ్గా 50 ఏళ్ల క్రితం 1975 ఏప్రిల్ 19న భారతదేశ చరిత్రలో కీలక ఘట్టం జరిగింది. మన దేశ తొలి ఉపగ్రహం ఆర్యభట్టను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రయోగించింది. రష్యా (సోవియట్)కు చెందిన కాస్మోస్-3ఎం రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈక్రమంలో కాస్మోస్-3ఎం రాకెట్‌ను కూడా మన భారత్‌లోనే పూర్తిగా డిజైన్ చేశారు. అయితేే ఆర్యభట్ట ప్రయోగాన్ని మాత్రం రష్యాలోని కపుస్తిన్ యర్ పట్టణంలో నిర్వహించారు. ఈ ఉపగ్రహ ప్రయోగంతో ముడిపడిన కీలక సమాచారాన్ని మనం తెలుసుకుందాం..
ఆర్యభట్ట ఉపగ్రహ ప్రయోగం గురించి..
- ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ ఉడుపి రామచంద్ర రావు (యూఆర్ రావు) బృందం 36 నెలల్లో తయారు చేసింది.
- కర్ణాటక రాజధాని బెంగళూరులో కాటేజ్ ఇండస్ట్రీలకు నెలవైన పీణ్య ఏరియాలో ఉన్న ఒక చిన్న ఇంట్లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని తయారు చేశారు.
- దేశంలోని పలు ప్రముఖ కంపెనీల ఇంజనీర్లు, శాస్త్రవేత్తలతో కలిసి యూఆర్ రావు ఈ ఉపగ్రహాన్ని తయారు చేశారు.
- ఆర్యభట్ట తయారయ్యాక.. 1975 ఏప్రిల్‌లో దీన్ని లాంఛింగ్ కోసం నాటి రష్యా (సోవియట్)కు అప్పగించారు.
- ఆర్యభట్ట ఉపగ్రహాన్ని అమెరికాలో స్కౌట్ లాంచ్ వెహికిల్ ద్వారా లాంచ్ చేయాలని భారత ప్రభుత్వం 1971లో అనుకుందట. అయితే రష్యాకు చెందిన మల్టీ స్టేజ్ రాకెట్‌తో అయితే ఈ ప్రయోగాన్ని తక్కువ ఖర్చుతో పూర్తి చేయొచ్చని భారత్ భావించిందట. అందుకే ఈ ప్రయోగం బాధ్యతను రష్యాకు అప్పగించింది.
- భారత్‌లో తయారు చేసిన ఆర్యభట్ట శాటిలైట్‌ను సోవియట్ కాస్మోడ్రోమ్ నుంచి లాంచ్ చేసేందుకు 1972లో యూఎస్ఎస్ఆర్ అకాడమీ ఆఫ్ సైన్సెస్‌తో ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది.
Also Read :Suriya Emotional: తండ్రి మాటలకు సూర్య ఎమోషనల్.. రియాక్షన్ ఇదీ
ఆర్యభట్ట పేరు ఎందుకంటే..
- 5వ శతాబ్దానికి చెందిన ప్రముఖ గణిత, ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట(Aryabhata 50 Years) పేరును భారత్ తొలి శాటిలైట్‌కు పెట్టారు.
- ఆర్యభట్ట శాటిలైట్‌ను ప్రయోగించిన ఏప్రిల్ 19వ తేదీని మనం ఏటా శాటిలైట్ టెక్నాలజీ డేగా జరుపుకుంటాం.
- ఆర్యభట్ట బరువు 358 కేజీలు. ఇది షట్కోణం ఆకారంలో ఉంటుంది. 26 సైడ్స్‌తో దీన్ని రూపొందించారు. ఈ ఉపగ్రహానికి ప్రధాన పవర్ సోర్సులుగా దాని బాడీ అంతా (పైన, కింద వదిలేసి) సోలార్ సెల్స్, నికెల్ కాడ్మియం (ఎన్ఐ-సీడీ ) బ్యాటరీలను పెట్టారు.
- ఈ ఉపగ్రహానికి ఉన్న పై భాగం, అడుగు భాగం తప్ప 24 సైడ్స్‌కు సోలార్ ప్యానల్స్‌ను 46 వాట్స్ పవర్ కోసం వాడారు. అలా ఉత్పత్తి చేసిన పవర్‌ను బ్యాకప్ కోసం 10 ఆంపియర్- అవర్ కెపాసిటీతో నికెల్ కాడ్మియం బ్యాటరీలను వాడారు.
- ఆర్యభట్ట ఉపగ్రహం కక్ష్యలోకి వెళ్లిన 4 రోజుల తర్వాత పవర్ ఫెయిల్యూర్ కారణంగా దీనితో రీసెర్చ్ ఆగిపోయింది. అయితే 1981 మార్చి వరకు ఆర్యభట్టకు చెందిన స్పేస్‌క్రాఫ్ట్ మెయిన్‌ఫ్రేమ్‌లో ఎలాంటి సమస్య రాలేదు.
- 17 ఏళ్ల పాటు కక్ష్యలో ఉన్న తర్వాత 1992 ఫిబ్రవరి 11న ఈ ఉపగ్రహం తిరిగి భూవాతావరణంలోకి వచ్చింది.
కొన్ని రోజుల ముందే విక్రమ్ సారాభాయి మరణం..
- ఆర్యభట్ట ఉపగ్రహం లాంఛింగ్ జరిగిన కొన్నేళ్ల తర్వాత యూఆర్ రావు ఇస్రో ఛైర్మన్ అయ్యారు. 1984 నుంచి 1994 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు.
- విక్రమ్ సారాభాయి విద్యార్థే యూఆర్ రావు.
- భారత దేశంలో శాటిలైట్ ప్రోగ్రామ్‌ను నడిపించేందుకు ఒక బాధ్యాతయుతమైన వ్యక్తి కావాలని విక్రమ్ సారాభాయి అనుకున్నారట. అందుకే మస్సాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి యూఆర్ రావును పిలిపించి, శాటిలైట్ ప్రోగ్రామ్ పనిని ఆయనకు అప్పగించారట.
- ఆర్యభట్ట శాటిలైట్‌ను లాంచ్ చేయడానికి కొన్ని రోజుల ముందే ఇస్రో ఫౌండర్ విక్రమ్ సారాభాయి మరణించారు.
- ఆర్యభట్ట ఉపగ్రహం పంపించే డేటాను పొందేందుకు, శాటిలైట్‌కు కమాండింగ్ కోసం శ్రీహరికోటలో ప్రధాన గ్రౌండ్ స్టేషన్ ఉంది.