Port Blair : ‘పోర్ట్ బ్లెయిర్’కు ఆ పేరు ఎలా వచ్చింది ? బ్లెయిర్ ఎవరో తెలుసా ?
ఈనేపథ్యంలో అసలు పోర్ట్ బ్లెయిర్(Port Blair) అనే పేరు ఎలా వచ్చింది ? దాని చరిత్ర ఏమిటి ?
- By Pasha Published Date - 11:20 AM, Sat - 14 September 24

Port Blair : అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరం పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మారుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పోర్ట్ బ్లెయిర్ నగరం పేరులోని వలసవాద ముద్రను తొలగించేందుకే పేరును మార్చామని వెల్లడించింది. ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి నౌకాదళ స్థావరంగా ఈ ద్వీప భూభాగం పనిచేసిందని కేంద్ర సర్కారు గుర్తు చేసింది. ఈనేపథ్యంలో అసలు పోర్ట్ బ్లెయిర్(Port Blair) అనే పేరు ఎలా వచ్చింది ? దాని చరిత్ర ఏమిటి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read :Telangana Congress : టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల రేసులో ఉన్నది వీరే..
- బ్రిటీష్ జాతీయుడైన కెప్టెన్ ఆర్కిబాల్డ్ బ్లెయిర్ పేరునే పోర్ట్ బ్లెయిర్ నగరానికి పెట్టారు.
- ఈయన 1771 సంవత్సరంలో బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బాంబే మెరైన్‌లో లెఫ్టినెంట్‌గా చేరారు.
- కెప్టెన్ బ్లెయిర్ 1788 డిసెంబర్ నుంచి 1789 ఏప్రిల్ వరకు అండమాన్ దీవులలో లెఫ్టినెంట్‌గా వ్యవహరించారు.
- అండమాన్ దీవుల భౌగోళిక స్వరూపంపై ఆయన ఎంతో రీసెర్చ్ చేశారు. ఆ వివరాలతో రూపొందించిన నివేదికను 1789 జూన్ 12న బ్రిటీష్ గవర్నర్ జనరల్‌కు సమర్పించారు.
- అండమాన్ ద్వీపాలను కూడా బ్రిటీష్ వలసరాజ్యంలో భాగంగా చేసుకోవాలని కెప్టెన్ బ్లెయిర్ కీలకమైన సిఫార్సు చేశారు.
- తన రీసెర్చ్‌లో భాగంగా అండమాన్ ద్వీపంలోని దక్షిణ భాగంలో ఒక సహజ సిద్ధమైన నౌకాశ్రయాన్ని కెప్టెన్ బ్లెయిర్ గుర్తించారు. బ్రిటీష్ ఇండియన్ నేవీకి చెంది కమాండర్-ఇన్-చీఫ్ కమోడోర్ విలియం కార్న్‌వాలిస్ గౌరవార్థం దానికి తొలుత పోర్ట్ కార్న్‌వాలిస్ అనే పేరును పెట్టారు. ఈ నౌకాశ్రయం తదనంతర కాలంలో కెప్టెన్ బ్లెయిర్ గౌరవార్ధం పోర్ట్ బ్లెయిర్‌గా మారింది.
- కెప్టెన్ బ్లెయిర్ 1789లో న్యూజిలాండ్‌లోని చాతం ద్వీపంలో మొదటి బ్రిటీష్ స్థావరాన్ని స్థాపించారు. అక్కడ ఆయన కాటేజీల నిర్మాణాన్ని, అడవులను తొలగించే కార్యకలాపాలను పర్యవేక్షించేవారు.
- కెప్టెన్ బ్లెయిర్ 1795లో ఇంగ్లండ్‌కు తిరిగి వెళ్లిపోయారు.
- 1858 సంవత్సరంలో బ్రిటీష్ వాళ్లు ఖైదీలను బంధించే కాలనీగా అండమాన్ దీవులను మార్చారు. దేశానికి సుదూరంగా వేలాది మంది భారత స్వాతంత్య్ర సమరయోధులను అక్కడి జైళ్లలో బంధించారు.