Udyogini Scheme : వడ్డీ లేకుండా 3 లక్షల లోన్.. సగం మాఫీ.. ఎలా ?
Udyogini Scheme : ఒకటి కాదు.. పది కాదు.. 88 రకాల వ్యాపారాలు చేసుకునే మహిళలకు గొప్ప అవకాశం.
- By Pasha Published Date - 09:30 AM, Thu - 9 May 24

Udyogini Scheme : ఒకటి కాదు.. పది కాదు.. 88 రకాల వ్యాపారాలు చేసుకునే మహిళలకు గొప్ప అవకాశం. రూ.3 లక్షల దాకా లోన్‌ను వడ్డీ లేకుండా పొందే ఛాన్స్. అంతేకాదు.. లోన్ అమౌంటులో సగ భాగాన్ని తిరిగి కడితే సరిపోతుంది. చిన్నతరహా కుటీర పరిశ్రమలు, కిరాణా దుకాణాలు, బేకరీ, బ్యూటీ పార్లర్లు, క్యాంటీన్, కేటరింగ్, కాఫీ, టీ పౌడర్ తయారీ, డయాగ్నస్టిక్ సెంటర్, డ్రై క్లీనింగ్, గిఫ్ట్ ఆర్టికల్స్, జిమ్, ఐస్ క్రీమ్ పార్లర్, టైలరింగ్ షాపులు, అగరబత్తుల తయారీ, పాల డెయిరీ, గ్రంథాలయం, మట్టి పాత్రల తయారీ, గాజుల తయారీ, పేపర్ ప్లేట్ల తయారీ వంటివి చేసుకునే వారికి ఈ గొప్ప రుణ సాయం లభిస్తుంది. ఇంతకీ ఎలా ? ఏ స్కీం(Udyogini Scheme) ద్వారా ? ఇప్పుడు తెలుసుకుందాం..
We’re now on WhatsApp. Click to Join
ఎవరు అర్హులు ?
- మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే ‘ఉద్యోగిని’.
- ఈ స్కీమ్‌కు 18 నుంచి 55 సంవత్సరాలలోపు వయసున్న మహిళలు అర్హులు.
- వార్షికాదాయం లక్షన్నరకు మించకూడదు.
- దివ్యాంగులు, వితంతువులకు ఎలాంటి ఆదాయ గరిష్ట పరిమితి లేదు.
- క్రెడిట్ స్కోర్ బాగుండాలి.
- గతంలో ఎక్కడా లోన్ తీసుకుని ఎగ్గొట్టిన చరిత్ర ఉండకూడదు.
- ఈ స్కీమ్ ద్వారా మహిళలకు రూ. మూడు లక్షల వరకు వడ్డీ లేని లోన్ ఇస్తారు. తీసుకున్న అప్పులో యాభై శాతం వరకు మాఫీ కూడా చేస్తారు.
- ఎస్సీ,ఎస్టీ వర్గాల మహిళలకు రూ. లక్ష నుంచి రూ. మూడు లక్షల వరకు లోన్ ఇస్తారు. 50 శాతం సబ్సిడీ దొరుకుతుంది. వడ్డీ ఉండదు.
- బీసీ, జనరల్ వర్గాల మహిళలకు రూ. మూడు లక్షల వరకు లోన్ ఇస్తారు. 30 శాతం సబ్సిడీ ఇస్తారు. వడ్డీ బ్యాంకులను బట్టీ 8 నుంచి 12 శాతంలోపు ఉంటుంది.
Also Read : AP Congress : ఏపీలో కాంగ్రెస్‌కు ఆశాదీపంలా ఆ 2 నియోజకవర్గాలు
అప్లై ఇలా..
- సంబంధిత ప్రభుత్వ బ్యాంకు వెబ్ సైట్ నుంచి ఉద్యోగిని స్కీమ్ దరఖాస్తును డౌన్లోడ్ చేసుకోండి.
- దాన్ని నింపి మీ దగ్గరున్న డాక్యుమెంట్లు జత చేసి, డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టుతో బ్యాంకు మేనేజర్‌ను కలవండి.
- దీనికి అప్లై చేయడానికి మూడు పాస్‌పోర్టు సైజ్ ఫోటోలు, ఫోటో గుర్తింపు కార్డు (ఆధార్, రేషన్ లేదా ఓటర్) ఉండాలి.
- మీరు చేస్తున్న వ్యాపారానికి సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును తయారు చేసుకోండి. పెట్టుబడి ఎంత ? ఖర్చులు ఎన్ని ? టర్నోవర్ ఎంత ? ఆదాయం ఎంత ? లాభం ఎంత ? అనేది అందులో ప్రస్తావించండి.
- మీరు పనిచేసే రంగానికి సంబంధించి శిక్షణ పొందిన సర్టిఫికెట్లను యాడ్ చేయండి.
- కుటుంబ వార్షికాదాయ ధ్రువీకరణ పత్రం జతపరచండి.
- కుల ధ్రువీకరణ పత్రం కూడా పెట్టండి.
- వ్యాపారానికి అయ్యే పెట్టుబడిపై కొటేషన్‌ను రాయించుకోండి.
- మీరు సమర్పించిన డీపీఆర్ నచ్చితే బ్యాంకు మేనేజర్ మీకు లోన్ ఇస్తారు.