Lucknow Building Collapse: కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో (Lucknow) లోని వజీర్ హసంగంజ్ రోడ్డులో నివాస భవనం కుప్పకూలడంతో కలకలం రేగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 40-50 మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని, ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు.
- Author : Gopichand
Date : 25-01-2023 - 6:25 IST
Published By : Hashtagu Telugu Desk
ఉత్తరప్రదేశ్‌లోని లక్నో (Lucknow) లోని వజీర్ హసంగంజ్ రోడ్డులో నివాస భవనం కుప్పకూలడంతో కలకలం రేగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. 40-50 మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని, ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు. ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. భూకంపం ధాటికి భవనం కూలిపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సంఘటన లక్నోలోని హజ్రత్‌గంజ్ ప్రాంతంలోని వజీర్ హసన్ రోడ్‌లో జరిగింది. భవనం పాతదని అధికారులు చెప్పారు. భవనం కింద నుంచి ఐదుగురిని కాపాడినట్లు డీజీపీ దేవేంద్ర సింగ్ చౌహన్ మీడియాకు తెలిపారు.
మరోవైపు, ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి, వారికి సరైన చికిత్స అందించాలని జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. దీంతో పాటు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని సీఎం యోగి ఆకాంక్షించారు. అదే సమయంలో, జిల్లా మేజిస్ట్రేట్, సీనియర్ పోలీసు అధికారులతో పాటు, SDRF, NDRF బృందాలు సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో పాటు పలు ఆసుపత్రులకు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Earthquake in Delhi: బ్రేకింగ్.. ఢిల్లీలో భారీ భూకంపం!
ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రిజేష్ పాఠక్ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ప్రమాదంపై డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. భవనం ఒక్కసారిగా కుప్పకూలిందని, సహాయక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. SDRF, NDRF బృందాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి. ప్రజలను రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. లక్నోలోని అన్ని ఆస్పత్రులు అప్రమత్తంగా ఉన్నాయని, నాలుగు అంతస్తుల ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఉన్నతాధికారులందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన తెలిపారు.