HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >3 Arrested For Sexually Assaulting 12 Year Old Girl In Bengal

Minor Girl Rape : బెంగాల్‌లో దారుణం.. 12 ఏళ్ల బాలిక‌పై ముగ్గురు లైంగిక దాడి

పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హత్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలికపై...

  • By Prasad Published Date - 07:38 AM, Fri - 23 September 22
  • daily-hunt
Gang Raped
Gang Raped

పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హత్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. 12 ఏళ్ల బాలికపై ముగ్గురు యువ‌కులు లైంగిక దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో లైంగిక‌దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సెప్టెంబర్ 20న రబీయుల్ గాజీ ఒక మైనర్ బాలికతో కలిసి ప్రయాణిస్తున్నాడు. సీల్దా స్టేషన్ కాంప్లెక్స్‌లో హోట‌ల్‌లో ఉండకుండా ఆ రాత్రికి స్టేషన్‌లోనే ఆ బాలిక‌తో ఉన్నాడు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో బాలిక ఆకలితో ఉండడంతో ఇద్దరూ ఆహారం కోసం బయటకు వెళ్లారు. ఆ సమయంలోనే ఒక వ్యక్తి రబీయుల్ గాజీని, బాలికను సంప్రదించి వారికి మంచి ఆహారం, వసతి కల్పిస్తామని హామీ ఇచ్చాడు. ఇద్దరు ఆ వ్యక్తితో కలిసి ఏదో తెలియని ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం. నిందితుడు మైనర్ బాలికను వేచి ఉండమని కోరాడు. వసతి చూసే నెపంతో రబీయుల్‌ను మరొక ప్రదేశానికి తీసుకెళ్లాడు. నిందితుడు రబీయుల్‌ను విడిచిపెట్టి మైనర్ బాధితురాలి వద్దకు తిరిగి వచ్చాడు. నిందితుడు తన సహచరులిద్దరిని పిలిచి, మైనర్ బాధిత బాలికను కోల్‌కతాలోని నార్కెల్‌దంగా నార్త్ రోడ్‌లోని 49 సమీపంలోని మారుమూల ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ముగ్గురు యువ‌కులు మైనర్ బాధితురాలిపై ఒకరి తర్వాత ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడిన‌ట్లు పోలీసులు తెలిపారు.

రబీయుల్ స్వయంగా మైనర్ బాలిక కోసం వెతకడం ప్రారంభించాడు. ఇద్దరు వ్య‌క్తుల స‌హాయంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. నార్కెల్‌దంగ నార్త్ రోడ్‌లోని దిలీప్ బేకరీ సమీపంలో స్కూటీపై ముగ్గురు అబ్బాయిలతో పాటు అమ్మాయిని పోలీసులు గుర్తించారు. డ్యూటీ ఆఫీసర్ వెంబడించి మైనర్ బాలికను రక్షించాడు. అయితే నిందితులు పారిపోయారు. రబీయుల్, బాలికను పోలీసు స్టేషన్‌కు తీసుకువచ్చారు మైన‌ర్ బాలిక‌ను వైద్య పరీక్షల కోసం పంపారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు రంగంలోకి దిగి నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. మొదటి నిందితుడు మహమ్మద్ సైఫ్‌ను బుధవారం ఉదయం పట్టుకున్నారు. అతని వాంగ్మూలాన్ని అనుసరించి, స్కూటీని ట్రాక్ చేసి స్వాధీనం చేసుకున్నారు. మ‌రో నిందితుడు ఎండీ ఆజాద్, అతని సహచరుడు ఎండీ జాఫర్‌ను బుర్ద్వాన్‌లోని రాణిగుంగే మజార్ నుండి పట్టుకున్నారు. నిందితులందరినీ కోర్టులో హాజరుపరచగా సెప్టెంబర్ 28 వరకు పోలీసు కస్టడీకి అప్పగించారు. ఈ కేసులో తల్లిదండ్రులకు తెలియకుండా మైనర్ బాలికను బసిర్‌హత్ నుంచి తీసుకొచ్చిన రబీయుల్ గాజీని కూడా అరెస్టు చేశారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bengal
  • crime
  • crime news
  • miior girl rape
  • West Bengal Police

Related News

    Latest News

    • ‎Rice: ప్రతీరోజూ 3 పూటలా అన్నం తింటున్నారా? అయితే ఇది మీకోసమే!

    • ‎Cabbage: తరచుగా క్యాబేజీ తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

    • ‎Leftover Rice: రాత్రి మిగిలిపోయిన అన్నం తింటున్నారా.. అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

    • Spiritual: ‎చేతిలో నుంచి హారతి పళ్ళెం కింద పడిపోతే ఏం జరుగుతుందో, దాని అర్థం ఏంటో మీకు తెలుసా?

    • Crow: ఇంటి ముందుకు ఈ దిశలో కాకి అరుస్తుందా.. అయితే జరగబోయేది ఇదే?

    Trending News

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

      • WTC Points Table: సౌతాఫ్రికాతో ఓట‌మి త‌ర్వాత‌ టీమిండియాకు మ‌రో బిగ్ షాక్‌!

      • Annadata Sukhibhava : ఏపీ రైతుల అకౌంట్‌లలోకి మరో రూ.6వేలు..అచ్చెన్నాయుడు శుభవార్త !

      • Constitution Day : ప్రజల మహోన్నత శక్తి.. రాజ్యాంగం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd