IIT Bombay : 25 శాతం ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్లకు నో ప్లేస్‌మెంట్స్
ఐఐటీ బాంబే(IIT Bombay) నుంచి క్యాంపస్ ప్లేస్‌మెంట్లు పొందుతున్న వారు అందుకుంటున్న సగటు శాలరీ ప్యాకేజీ కూడా తగ్గిపోయింది.
- By Pasha Published Date - 04:06 PM, Tue - 3 September 24
IIT Bombay : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో చదివితే చాలు.. బంపర్ జాబ్ ఆఫర్ దానంతట అదే వచ్చేస్తుందని చాలామంది భావిస్తుంటారు. కానీ అది అవాస్తవం. ప్రఖ్యాత ఐఐటీలో చదివినంత మాత్రాన ఆఫర్ వచ్చేయదు. తాజాగా ఐఐటీ బొంబాయి నుంచి వచ్చిన నివేదికలను చూస్తే ఈవిషయం స్పష్టంగా అర్థమైపోతుంది. అదేమిటంటే.. ఐఐటీ బాంబేలో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వారిలో 25 శాతం మందికి క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఆఫర్లు దొరకడం లేదట. ఎందుకు ? అంటే.. వారిలో జాబ్స్ చేయడానికి అవసరమైనన్ని టెక్నికల్ స్కిల్స్ లేవు. పెద్ద విద్యాసంస్థలో చదువుతున్నా.. స్కిల్స్ పెంచుకోవడంపై శ్రద్ధ పెట్టకపోవడంతో ఇలాంటి దుస్థితిని చాలామంది ఐఐటీ గ్రాడ్యుయేట్లు ఎదుర్కోవాల్సి వస్తోంది.
We’re now on WhatsApp. Click to Join
ఐఐటీ బాంబే(IIT Bombay) నుంచి క్యాంపస్ ప్లేస్‌మెంట్లు పొందుతున్న వారు అందుకుంటున్న సగటు శాలరీ ప్యాకేజీ కూడా తగ్గిపోయింది. ఈసారి కొంతమంది ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్లకు కేవలం రూ.4 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ లభించింది. గతేడాది అత్యల్పంగా కొందరు ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్లకు రూ.6 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ వచ్చింది. అంటే గతేడాదికి ఇప్పటికి వార్షిక వేతన ప్యాకేజీ రూ.2 లక్షల మేర తగ్గిపోయింది.
Also Read :Anti Rape Bill : యాంటీ రేప్ బిల్లు ‘అపరాజిత’ను ఆమోదించిన బెంగాల్ అసెంబ్లీ
మరోవైపు అత్యధిక వేతన ప్యాకేజీని కూడా కొందరు విద్యార్థులు ఈసారి అందుకున్నారు. గత సంవత్సరం టాప్ ట్యాలెంటెడ్ ఐఐటీ బాంబే గ్రాడ్యుయేట్లకు రూ.21.8 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ రాగా, ఈసారి అది 7.7 శాతం మేర పెరిగి రూ.23.5 లక్షలకు పెరగడం గమనార్హం. ఈదఫా క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొన్న వారిలో 75 శాతం మందికే జాబ్ ఆఫర్స్ వచ్చాయి. 1475 మంది జాబ్ ఆఫర్ లెటర్లు అందుకున్నారు. గతేడాది ఐఐటీ బాంబే నుంచి అత్యధికంగా 82 శాతం గ్రాడ్యుయేట్లకు జాబ్ ఆఫర్లు లభించాయి. ఈసారి అవి 75 శాతానికి పరిమితమయ్యాయి.
Related News
11500 Railway Jobs : 11,558 రైల్వే జాబ్స్.. ఇంటర్, డిగ్రీ చేసిన వారికి గొప్ప అవకాశం
ఈ జాబ్స్‌కు(11500 Railway Jobs) ఎంపికయ్యే వారికి రూ.29,200 నుంచి రూ.35,400 దాకా నెలవారీ పే స్కేల్ లభిస్తుంది.