Tihar Jail: తీహార్ జైలులో ఖైదీ నుంచి సర్జికల్ బ్లేడ్స్, డ్రగ్స్ స్వాధీనం
తీహార్ జైలు (Tihar Jail)లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జైలులో బంధించిన ఖైదీ నుంచి 23 సర్జికల్ బ్లేడ్‌లు, స్మార్ట్‌ఫోన్లు, డ్రగ్స్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.
- By Gopichand Published Date - 01:09 PM, Sat - 11 March 23

తీహార్ జైలు (Tihar Jail)లో అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జైలులో బంధించిన ఖైదీ నుంచి 23 సర్జికల్ బ్లేడ్‌లు, స్మార్ట్‌ఫోన్లు, డ్రగ్స్, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన గురువారం (మార్చి 9) జరిగింది. గురువారం ఉదయం జైలు నంబర్ 2 సిబ్బంది కొంతమంది ఖైదీలలో అనుమానాస్పద కార్యకలాపాలను గమనించారని జైలు అధికారి తెలిపారు. దీని తరువాత ఓ ఖైదీలను ఆపి శరీర శోధన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ ఖైదీ వద్ద నుంచి 23 సర్జికల్ బ్లేడ్లు, డ్రగ్స్, రెండు టచ్ స్క్రీన్ ఫోన్లు, సిమ్ కార్డ్, ఇతర నిషేధిత వస్తువులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్యాకెట్ ను పక్కనే ఉన్న జైలు గోడలపై పడేసినట్లు జైలు అధికారుల విచారణలో తేలింది. ప్యాకెట్‌ను లోపలికి విసిరిన ఖైదీని గుర్తించినట్లు అధికారి తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దేశ రాజధానిలోని జైళ్లలో ఫోన్‌ల వినియోగాన్ని నిలిపివేయడానికి గత నెలలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిపుణుల కమిటీని ఆమోదించారు. 10 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ జైళ్లను చైర్మన్‌గా నియమించారు. జైలులో ఖైదీలు మొబైల్ ఫోన్లు ఉపయోగించకుండా మెరుగైన సిగ్నల్ జామర్‌ను కనుగొనే బాధ్యతను కమిటీకి అప్పగించారు. ఢిల్లీలోని తీహార్‌తో పాటు, రోహిణి, మండోలిలో కూడా జైలు ఉంది. ఇందులో మొత్తం 18000 మంది ఖైదీలు ప్రస్తుతం నివసిస్తున్నారు.
Also Read: Liquor Queen Kavitha: కవితపై రెచ్చిపోతున్న ట్రోలర్స్.. ‘లిక్కర్ రాణి’ అంటూ ఫొటోలు షేర్!
ఢిల్లీ జైళ్లలో ఫోన్‌ల వినియోగం ఒక ప్రధాన సమస్యగా మిగిలిపోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది ఆగలేదు. గత రెండు నెలల్లో ఢిల్లీలోని మూడు జైళ్లలో ఖైదీల నుంచి 348 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. జైలు అధికారులకు ఇదే పెద్ద ప్రమాద ఘంటికగా భావిస్తున్నారు. ఏడాదిలో ఈ మూడు జైలు ప్రాంగణాల్లో దాదాపు 100-200 ఫోన్లు స్వాధీనం చేసుకున్నందున ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని జైలు అధికారులు తెలిపారు.

Related News

WPL Final: తొలి టైటిల్ చిక్కేదెవరికి? ఢిల్లీ, ముంబై మధ్య ఫైనల్ ఫైట్
మహిళల ఐపీఎల్ తొలి సీజన్ ఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య టైటిల్ పోరు జరగబోతోంది.