IB Jobs -226 : ఇంటెలిజెన్స్ బ్యూరోలో 226 జాబ్స్.. టెకీలకు గుడ్ ఛాన్స్
IB Jobs -226 : అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలీజెన్స్ ఆఫీసర్ (ACIO) పోస్టుల భర్తీకి ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నోటిఫికేషన్ విడుదల చేసింది.
- Author : Pasha
Date : 24-12-2023 - 12:01 IST
Published By : Hashtagu Telugu Desk
IB Jobs -226 : అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలీజెన్స్ ఆఫీసర్ (ACIO) పోస్టుల భర్తీకి ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 226 ACIO పోస్టులను రిక్రూట్ చేయనుంది. వీటిలో 147 పోస్టులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్ విభాగంలో, 79 పోస్టులు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో ఉన్నాయి. ఈ పోస్టులలో 93 అన్ రిజర్వుడ్ కేటగిరీలో ఉన్నాయి. 24 పోస్టులు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్), 71 పోస్టులు ఓబీసీలకు, 29 పోస్టులు ఎస్సీలకు, 9 పోస్టులు ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యునికేషన్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లలో బీఈ లేదా బీటెక్ చేసిన వారు ఈ జాబ్స్‌కు అర్హులు. ఎలక్ట్రానిక్స్/ ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యునికేషన్/ కంప్యూటర్ సైన్స్‌లలో ఎంఎస్సీ చేసినవారు కూడా వీటికి అప్లై చేయొచ్చు. కంప్యూటర్స్ అప్లికేషన్స్‌లో పీజీ చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 2021/ 2022/ 2023లలో ఏదో ఒక సంవత్సరానికి సంబంధించిన గేట్ స్కోర్ కూడా తప్పనిసరిగా అభ్యర్థులకు ఉండాలి.
Also Read: Prashant Kishor – IPAC : ఐప్యాక్.. ప్రశాంత్ కిషోర్.. ఏపీలో పొలిటికల్ హీట్
2024 జనవరి 12 నాటికి 18 ఏళ్లు నుంచి 27 ఏళ్లలోపు వయసు కలిగిన ఈ పోస్టులకు(IB Jobs -226) అర్హులు. జనరల్, ఓబీసీ, ఈడబ్లూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.200 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. గేట్ స్కోర్/ ఇంటర్వ్యూ, సైకోమెంట్రిక్/ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత అభ్యర్థులను అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికయ్యే అభ్యర్థులకు ప్రతినెలా పే స్కేలు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు లభిస్తుంది. అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అభ్యర్థులు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అధికారిక వెబ్సైట్ https://www.mha.gov.in ద్వారా అప్లికేషన్లు సమర్పించవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి లాస్ట్ డేట్ జనవరి 12. అప్లికేషన్ ఫీజు కట్టడానికి లాస్ట్ డేట్ జనవరి 16.