HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >18 Yr Old Abducts Ex Boyfriend Over 30000 Debt Five Nabbed

Ex boy friend abducted for Rs 30000: రూ.30 వేల బాకీ కోసం మాజీ బాయ్ ఫ్రెండ్ ను కిడ్నాప్ చేసిన టీనేజి అమ్మాయి

కోల్ కతాలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. మాజీ బాయ్ ఫ్రెండ్ తన బాకీ చెల్లించలేదంటూ ఓ టీనేజి అమ్మాయి ఏకంగా అతడిని కిడ్నాప్ చేయించింది.

  • By Hashtag U Published Date - 04:56 PM, Thu - 25 August 22
  • daily-hunt
Crime
Crime

కోల్ కతాలో ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. మాజీ బాయ్ ఫ్రెండ్ తన బాకీ చెల్లించలేదంటూ ఓ టీనేజి అమ్మాయి ఏకంగా అతడిని కిడ్నాప్ చేయించింది. బెలియాఘటా ప్రాంతానికి చెందిన తమల్ అధికారి (22), కెస్తోపూర్ కు చెందిన ఆ టీనేజి అమ్మాయి (18) కొంతకాలం పాటు ప్రేమించుకున్నారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. వారిద్దరూ సఖ్యతతో ఉన్న సమయంలో తమల్ అధికారికి ఆమె రూ.30 వేలు ఇచ్చింది. ఆ డబ్బు చేతిలో పడిన తర్వాత అతడు తనను పట్టించుకోవడం మానేశాడని ఆమె ఆగ్రహంతో ఉంది.

ప్రస్తుతం మరో యువకుడితో ప్రేమలో ఉన్న ఆ యువతి ఎలాగైనా మాజీ ప్రియుడి నుంచి ఆ బాకీ వసూలు చేయాలని నిర్ణయించుకుంది. “నిన్ను ఓసారి కలవాలని ఉంది” అంటూ తమల్ అధికారికి రాయబారం పంపింది. నిజమేనని నమ్మి వచ్చిన ఆ యువకుడిని తన ప్రస్తుత బాయ్ ఫ్రెండ్, అతడి స్నేహితుల సాయంతో కిడ్నాప్ చేసింది. భవానీపూర్ లేడీస్ పార్క్ సమీపంలోని ఓ గదిలో బంధించింది. తమల్ తండ్రి తపన్ (52)కు ఫోన్ చేసి డబ్బు తెస్తేనే అతడి కుమారుడ్ని వదిలిపెడతానని స్పష్టం చేసింది.

మొదట లక్ష రూపాయలు డిమాండ్ చేసిన ఆ యువతి, చివరికి రూ.30 వేలు ఇస్తే చాలంది. అయితే, కిడ్నాప్ కు గురైన యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. ఆ 18 ఏళ్ల యువతిని, ఆమె ప్రస్తుత బాయ్ ఫ్రెండ్ ని, అతడి ముగ్గురు స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. వారి బారి నుంచి తమల్ అధికారిని కాపాడారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ex boy friend abducted
  • girl kidnaps ex boy friend
  • kolkata

Related News

    Latest News

    • Illegal Relationship : అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త చెవులు కోసేసిన భార్య

    • HYD Metro : నష్టాల నుండి బయటపడేందుకు వాటాలను అమ్మేస్తున్న L&T

    • Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కోసం ఇప్పటివరకు ఎంత చెల్లించిందో తెలుసా..?

    • Google : వచ్చే నెలలో విశాఖకు గూగుల్

    • India-Pak ‘Handshake’ Row : షేక్ హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు – BCCI

    Trending News

      • Beggars Homes: బెగ్గర్స్‌ హోమ్స్‌ జైళ్ల కంటే దారుణం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

      • Cash Withdrawals: గుడ్ న్యూస్‌.. యూపీఐ ద్వారా డ‌బ్బు విత్‌డ్రా..!

      • Little Hearts Box Office: సూపర్ హిట్ మూవీగా లిటిల్ హార్ట్స్.. 8 రోజుల్లో భారీగా వసూళ్లు!

      • Fine For Late: ఈరోజే లాస్ట్ డేట్‌.. మిస్ అయితే రూ. 5 వేలు ఫైన్‌!

      • Maoist Sujatha: ఆమె లొంగుబాటుతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుందా??

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd