SBI Jobs : ఎస్‌బీఐలో 1100 జాబ్స్.. దరఖాస్తులకు నాలుగు రోజులే గడువు
1100 పోస్టులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) భర్తీ చేస్తోంది.
- By Pasha Published Date - 12:26 PM, Sat - 10 August 24

SBI Jobs : 1100 పోస్టులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) భర్తీ చేస్తోంది. వీటిలో ఎకనామిస్ట్ అండ్ డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ పోస్టులకు ఆగస్టు 6తో దరఖాస్తు గడువు ముగియనుంది. వీపీ వెల్త్, మేనేజర్‌తోపాటు ఇతర పోస్టులకు దరఖాస్తు గడువు ఆగస్టు 8తో ముగియనుంది. ఆఫీసర్స్/ క్లరికల్ కేడర్‌లోని 8 విభాగాలు, క్రీడా విభాగంలో స్పోర్ట్స్ పర్సన్ల నియామకం కోసం ఆగస్టు 14తో గడువు ముగియనుంది. గత మూడేళ్లలో అంతర్జాతీయ క్రీడల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించిన వారు మాత్రమే ఆఫీసర్స్ (స్పోర్ట్స్ పర్సన్) జాబ్స్‌కు అర్హులు.
Also Read :Iran New President : ఇరాన్ అధ్యక్షుడు వర్సెస్ ఐఆర్‌జీసీ.. ఇజ్రాయెల్‌పై దాడి విషయంలో తలోదారి
జాతీయ ఈవెంట్లో రాష్ట్రానికి లేదా రాష్ట్ర స్థాయి ఈవెంట్లో జిల్లాకు లేదా ఇంటర్ యూనివర్శిటీ ఈవెంట్లో డిస్టింక్షన్‌తో విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించిన వారు క్లరికల్ (క్రీడాకారులు) పోస్టులకు అప్లై చేయొచ్చు. కంబైన్డ్ యూనివర్సిటీస్ టీమ్‌లో సభ్యుడిగా వ్యవహరించిన వారు కూడా అప్లై చేయొచ్చు. ఎకనామిక్స్/ ఎకనామెట్రిక్స్/ స్టాటిస్టిక్స్/ అప్లయిడ్ స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/ మ్యాథమెటికల్ ఎకనామిక్స్/ ఫైనాన్షియల్ ఎకనామిక్స్ కోర్సులలో కనీసం 60 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ చేసిన వారు ఎకనామిస్ట్ పోస్టులకు అప్లై చేయొచ్చు.ఇంటర్వ్యూ ఆధారంగా ఆర్థికవేత్తలు, డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ల ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ లేదా ఇంటరాక్షన్‌కు 100 మార్కులు ఉంటాయి. వీపీ వెల్త్, మేనేజర్, ఇతర పోస్టులకు షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ కమ్ సీటీసీ ద్వారా ఎంపిక చేస్తారు.
We’re now on WhatsApp. Click to Join
మొత్తం 1100 పోస్టులలో(SBI Jobs) అత్యధికంగా వీపీ వెల్త్ 643 పోస్టులు, రిలేషన్షిప్ మేనేజర్ 273 పోస్టులు, క్లరికల్ (స్పోర్ట్స్ పర్సన్ ) 51 పోస్టులు, ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ 39 పోస్టులు, రిలేషన్షిప్ మేనేజర్ టీమ్ లీడ్ 32 పోస్టులు, ఇన్వెస్ట్మెంట్ స్పెషలిస్ట్ 30 పోస్టులు ఉన్నాయి. ఇక ఆఫీసర్స్ (స్పోర్ట్స్ పర్సన్ ) 17 పోస్టులు, రీజినల్ హెడ్ 6 పోస్టులు, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (ప్రొడక్ట్ లీడ్) 2 పోస్టులు, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్ ) 2 పోస్టులు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (బిజినెస్) 2 పోస్టులు, ఎకనామిస్ట్ 2 పోస్టులు ఉన్నాయి. డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్ – ఆర్మీ 1 పోస్టు, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ మేనేజర్ (టెక్నాలజీ) 1 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా ఎస్‌బీఐ భర్తీ చేస్తోంది.జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు, ఇన్ఫర్మేషన్ ఛార్జీలు రూ.750 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.