Friendship Scam : కొంపముంచిన ఆన్‌లైన్ ఫ్రెండ్.. బాలికకు రూ.80 లక్షలు కుచ్చుటోపీ
బాధిత బాలిక గురుగ్రామ్(Friendship Scam) వాస్తవ్యురాలు. టెన్త్ క్లాస్ చదువుతోంది. సైబర్ కేటుగాడు కూడా గురుగ్రామ్ వాస్తవ్యుడే.
- By Pasha Published Date - 03:16 PM, Wed - 5 March 25

Friendship Scam : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ టార్గెట్‌గా ఎంచుకుంటున్నారు. పిల్లలకు, పెద్దలకు వేర్వేరు రకాల వ్యూహాలను అమలుపరుస్తూ డబ్బులను కాజేస్తున్నారు. తాజాగా ఒక టెన్త్ విద్యార్థినిని మాయ మాటలతో ఏమార్చి, ఆమె నానమ్మ బ్యాంకు అకౌంట్లలోని రూ.80 లక్షలను ఒక కేటుగాడు తస్కరించాడు. వివరాలివీ..
Also Read :Teenmar Mallanna: సీఎం రేవంత్ బీజేపీకి సహకరిస్తున్నారు.. మల్లన్న సంచలన ఆరోపణలు
రూ.80 లక్షలను ఇలా కాజేశాడు..
- బాధిత బాలిక గురుగ్రామ్(Friendship Scam) వాస్తవ్యురాలు. టెన్త్ క్లాస్ చదువుతోంది. సైబర్ కేటుగాడు కూడా గురుగ్రామ్ వాస్తవ్యుడే.
- వీళ్లిద్దరూ ఒక సోషల్ మీడియా యాప్ వేదికగా పరిచయం అయ్యారు.
- తొలుత ఇద్దరూ గంటల కొద్దీ ఛాటింగ్ చేసుకున్నారు.
- ఈక్రమంలోనే బాలికను మాటల్లో పెట్టి, ఆమె ఫోన్ నంబరును కేటుగాడు తీసుకున్నాడు.
- అనంతరం ఆ ఫోన్ నంబరుకు కేటుగాడు వీడియో కాల్ చేశాడు.
- వీడియో కాల్‌లో మాట్లాడే క్రమంలో ఆ బాలిక ఫొటోను తీసుకున్నాడు.
- ఆమె ఫొటోను అశ్లీలంగా కనిపించేలా ఎడిట్ చేయించాడు. దాన్ని బాలికకు పంపాడు.
- తన ఫొటో అశ్లీలంగా ఉండటాన్ని చూసి బాలిక భయపడింది.
- ఇక ఆన్‌లైన్‌లోకి వచ్చిన కేటుగాడు.. బ్లాక్ మెయిల్ తతంగాన్ని మొదలుపెట్టాడు.
- తనకు డబ్బులు ఇవ్వకుంటే.. ఆ ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని చెప్పాడు.
- దీంతో బాలిక హడలిపోయింది. వద్దు అని బతిమాలింది.
Also Read :Ramgopal Varma : ఆర్జీవీకి మరోసారి సీఐడీ అధికారుల నోటీసులు
నానమ్మ బ్యాంకు ఖాతాల నుంచి..
- బాధిత బాలిక సోషల్ మీడియాను చూసేందుకు వినియోగించే ఫోనులోనే.. ఆమె నానమ్మ బ్యాంకు ఖాతాల వివరాలు ఉన్నాయి. వాటిని తీసుకున్న బాలిక.. ఆ అకౌంట్ల నుంచి పెద్ద మొత్తంలో డబ్బును సైబర్ కేటుగాడి అకౌంట్లకు బదిలీ చేసింది.
- ఈవిధంగా కొన్ని నెలల పాటు బ్లాక్ మెయిలింగ్ కొనసాగింది. మొత్తం రూ.80 లక్షలను బాధిత బాలిక తన నానమ్మ బ్యాంకు ఖాతాల నుంచి కేటుగాడికి పంపింది.
- ఇంట్లో వాళ్లకు ఈవిషయాన్ని చెప్పడానికి బాలిక భయపడింది.
- చివరకు ఈవిషయాన్ని తన క్లోజ్ ఫ్రెండ్ ఒకరికి చెప్పింది.
- బాలిక ఫ్రెండ్ వెంటనే.. బాధితురాలి ఇంటికి వచ్చి కుటుంబీకులకు మొత్తం విషయాన్ని వివరించింది.
- దీంతో వారు 2024 డిసెంబరు 21న గురుగ్రామ్‌లోని సెక్టార్-10 పోలీసు స్టేషన్‌లో పిర్యాదు చేశారు.
- గురుగ్రామ్‌లోని గడీ హర్‌సరూ ఏరియాలో ఉన్న హయత్‌పూర్ రోడ్ కాలనీకి చెందిన నవీన్ కుమార్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.ఇప్పటివరకు ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
- నవీన్ వద్ద నుంచి రూ.5.13 లక్షల నగదును, బాధిత బాలిక డెబిట్ కార్డును రికవర్ చేశారు.
- ఈ ముఠాలో ఇంకా ఎక్కువ మంది నిందితులు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.