Punjab CM: సీఎం నివాసం వెలుపల చెత్త…జరిమానా విధించిన మున్సిపల్ శాఖ..!!
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసానికి భారీ జరిమాన విధించింది మున్సిపల్ శాఖ. చెత్త పారబోశారంటూ చండీగడ్ లోని సీఎం భగవంత్ మాన్ నివాసానికి రూ. 10వేల రూపాయలు జరిమానా వేశారు.
- By hashtagu Published Date - 07:35 PM, Sat - 23 July 22
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ నివాసానికి భారీ జరిమాన విధించింది మున్సిపల్ శాఖ. చెత్త పారబోశారంటూ చండీగడ్ లోని సీఎం భగవంత్ మాన్ నివాసానికి రూ. 10వేల రూపాయలు జరిమానా వేశారు. సీఆర్పీఎఫ్ బెటాలియన్ డిప్యూటీ సూపరింటిండెంట్ హర్జీంద్ సింగ్ పేరుతో ఈ మేరకు చలాన్ జారీ చేశారు అధికారులు. ఇందులో సీఎం ఇంటి అడ్రెస్ స్పష్టంగా పేర్కొన్నారు.
దీనిపై స్థానిక బీజేపీ కౌన్సిలర్ మహేశిందర్ సింగ్ సిద్దూ స్పందించారు. ముఖ్యమంత్రి నివాసం నుంచి చెత్త పారబోస్తున్నారంటూ స్థానికుల నుంచి ఫిర్యాదు వస్తున్నాయని తెలిపారు. చెత్తను రోడ్డుమీద పారయోద్దని సీఎం నివాసంలోని వారికి మున్సిపల్ సిబ్బంది ఎన్నో సార్లు చెప్పినా ఫలితం లేదన్నారు. ఈ క్రమంలోనే చలాజ్ జారీ చేసినట్లు వెల్లడించారు.
Related News
Amritpal Singh : ఎన్నికల బరిలో ఖలిస్థాన్ వేర్పాటువాది.. జైలు నుంచే పోటీ !
Amritpal Singh : అమృత్ పాల్ సింగ్.. మన దేశంలోని పంజాబ్ కేంద్రంగా ఖలిస్థానీ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన కరుడుగట్టిన టెర్రరిస్ట్.