BJP MPs Resign : 10 మంది బీజేపీ ఎంపీల రాజీనామా.. ఎందుకు ?
BJP MPs Resign : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు బుధవారం రాజీనామా చేశారు.
- By Pasha Published Date - 03:47 PM, Wed - 6 December 23

BJP MPs Resign : ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీలు, కేంద్రమంత్రులు బుధవారం రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. వీరంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. అనంతరం బీజేపీ చీఫ్ నడ్డా వారితో పాటు స్పీకర్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ తొమ్మిది మంది ఎంపీలు రాజీనామాలను సమర్పించారు. ఎంపీ కిరోరి లాల్ మీనా తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించారు.
We’re now on WhatsApp. Click to Join.
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 12 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. అయితే రాజీనామా చేసిన 10 మంది ఎంపీలలో మధ్యప్రదేశ్‌కు చెందిన నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ పటేల్, రాకేష్ సింగ్, ఉదయ్ ప్రతాప్ సింగ్, రితీ పాఠక్ ఉన్నారు. రాజస్థాన్ నుంచి ఎంపీలు రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, దియా కుమారి, కిరోరి లాల్ మీనా (రాజ్యసభ ఎంపీ) రాజీనామా చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన అరుణ్ సావో, గోమతి సాయి రాజీనామా లేఖలు సమర్పించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎంపీ బాబా బాలక్‌నాథ్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో నుంచి గెలిచిన కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ ఇంకా రాజీనామాలు సమర్పించలేదు.
Also Read: Kamala Harris : 200 ఏళ్ల కిందటి రికార్డును బద్దలుకొట్టిన కమలా హ్యారిస్
ఇప్పటివరకు నరేంద్ర సింగ్ తోమర్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, ప్రహ్లాద్ పటేల్ కేంద్ర ఆహార ప్రాసెసింగ్, జలశక్తి శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు. రాజస్థాన్ ఎన్నికల్లో పోటీ చేసిన కేంద్ర ఉక్కు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే గెలవలేకపోయారు. ఖాళీ అయిన మంత్రి పదవుల భర్తీ కోసం త్వరలోనే కేంద్ర మంత్రివర్గ పునర్విభజన జరిగే అవకాశం ఉందని(BJP MPs Resign) అంటున్నారు.