HashtagU Telugu
HashtagU Telugu Telugu HashtagU Telugu
  • English
  • हिंदी
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # PM Modi
  • # Chandrayaan
  • # Uniform Civil Code
  • # KCR
  • # Congress

  • Telugu News
  • ⁄Huzurabad By Elections2021
  • ⁄Shock To Kcr Break For Dalitbandhu

కేసీఆర్ కు షాక్.. దళితబంధుకు బ్రేక్!

హుజూరాబాద్ ఉప ఎన్నిక ముంగిట ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ తగిలింది. ఉప ఎన్నిక గెలుపు కోసం, దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే.

  • By Balu J Published Date - 12:57 PM, Tue - 19 October 21
  • daily-hunt
కేసీఆర్ కు షాక్.. దళితబంధుకు బ్రేక్!

హుజూరాబాద్ ఉప ఎన్నిక ముంగిట ముఖ్యమంత్రి కేసీఆర్ షాక్ తగిలింది. ఉప ఎన్నిక గెలుపు కోసం, దళితుల సంక్షేమం కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పథకం ద్వారా హుజూరాబాద్ లో గెలిచి, లాభపడాలని భావించిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఈసీ గట్టి షాక్ ఇచ్చింది. ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలును వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్ సోమవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దళిత బంధు అనేది ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు అందుతాయి. దళితుల సాధికారత కోసం ఉద్దేశించిన పథకం అక్టోబర్ 30 న ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు అమలును నియోజకవర్గంలో అన్ని విధాలుగా వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారిని ఆదేశించింది. అక్టోబర్ 19 మధ్యాహ్నం 2 గంటలలోపు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. దళితుల సాధికారత లక్ష్యంగా ఈ పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,000 కోట్లు విడుదల చేసింది. ఈ పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబం ఏదైనా వ్యాపారం చేసుకోవడానికి, స్వయం ఉపాధి సాధించడానికి రూ. 10 లక్షలు గ్రాంట్‌గా పొందుతుంది. అయితే రాష్ట్రంలో ఇతర చోట్లా కాకుండా, ఒక్క హుజూరాబాద్ లోనే ఈ పథకం ప్రారంభించడంతో ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఇది కేవలం ఓటర్లను ఆకర్షించడానికి మాత్రమే ఈ పథకం ప్రభుత్వం తీసుకొచ్చిందని వివిధ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. తెలంగాణ పార్టీ టీఆర్ఎస్ మాత్రం ఖండించింది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక షెడ్యూల్ తర్వాత కొనసాగుతున్న పథకాలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వర్తించదని ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయెల్ అన్నారు.

ఇదిలా ఉండగా.. నాలుగు మండలాల్లో దళిత బంధు పథకం అమలు కోసం ప్రభుత్వం సోమవారం రూ .250 కోట్లను విడుదల చేసింది. ఖమ్మం జిల్లాలోని మధిర అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతకాని మండలానికి రూ .100 కోట్లు, సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, అచ్చంపేటలోని చారకొండ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లాలోని కలువకుర్తి నియోజకవర్గాలకు సంబంధించి ఒక్కొక్కటి రూ .50 కోట్లు విడుదల చేసింది. భూ ఆక్రమణ ఆరోపణలపై రాష్ట్ర మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ వైదొలగడంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకొని బరిలో దిగారు. ఉప ఎన్నిక ముంగిట దళిత బంధు పథకానికి బ్రేక్ పడటంతో టీఆర్ఎస్ ప్రభుత్వానికి దెబ్బతగిలినట్టైందని చెప్పక తప్పదు.

Tags  

  • by poll
  • cm kcr
  • ec
  • huzurabad
  • politics
  • telengana
https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/drreddys.jpg

Related News

CM KCR: స్వామినాథన్ మరణంతో వ్యవసాయరంగం పెద్ద దిక్కును కోల్పోయింది: సీఎం కేసీఆర్

CM KCR: స్వామినాథన్ మరణంతో వ్యవసాయరంగం పెద్ద దిక్కును కోల్పోయింది: సీఎం కేసీఆర్

తాను రాష్ట్ర సచివాలయంలో సమావేశం కావడం మరిచిపోలేనని సీఎం కేసీఆర్ అన్నారు.

  • Harish Rao: అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా బీఆర్‌ఎస్ మేనిఫెస్టో: మంత్రి హరీశ్ రావు

    Harish Rao: అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా బీఆర్‌ఎస్ మేనిఫెస్టో: మంత్రి హరీశ్ రావు

  • Telangana : తెలంగాణను నియంత పరిపాలిస్తున్నాడని కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

    Telangana : తెలంగాణను నియంత పరిపాలిస్తున్నాడని కోమటిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

  • India vs Canada : ఇండియా, కెనడా వివాదం.. చైనాకు వినోదం

    India vs Canada : ఇండియా, కెనడా వివాదం.. చైనాకు వినోదం

  • Nara Brahmani : ‘నారా బ్రాహ్మణి’ లో అనుకూల అంశాలు ఏమిటి?

    Nara Brahmani : ‘నారా బ్రాహ్మణి’ లో అనుకూల అంశాలు ఏమిటి?

Latest News

  • AIMIM vs TDP: ఇప్పుడు ఏపీ ప్రజలు గుర్తుకు వచ్చారా? : టీడీపీ మైనారిటీ

  • Hyderabad Ganesh Immersion: హైదరాబాద్‌లో ప్రశాంతంగా ముగిసిన గణేష్ నిమజ్జన శోభాయాత్ర

  • Mumbai Ganesh Immersion: ముంబైలో 20,195 గణనాథుల విగ్రహాలు నిమజ్జనం

  • TDP : చంద్రబాబు అరెస్ట్ కేసులో సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ప్ర‌భుత్వం

  • Hyderabad: నాలాలో పడి మహిళ మృతి

Trending

    • Raped Dozens Of Dogs : 42 కుక్కలపై రేప్ చేసిన జంతు శాస్త్రవేత్త.. దోషిగా ఖరారు

    • Chandrababu Brand : ఏపీపై భారీ కుట్ర‌? రాష్ట్రానికి సంకెళ్లు.!

    • Ganesh Nimajjanam : వినాయక ఉత్సవాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి ? గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి ?

    • Weird Politics in AP : జ‌గ‌న్ కోసం MIM, BRS పోటీ?

    • Rs 2000 Note Exchange : 2వేల నోట్ల బదిలీ డెడ్ లైన్ ముంచుకొస్తోంది.. గడువు పొడిగిస్తారా ?

Hashtag U

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice

Telugu News

  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat

Trending News

  • PM Modi
  • Chandrayaan
  • Uniform Civil Code
  • kcr
  • Congress

follow us

  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd
Go to mobile version