Zika Virus : పుణేలో ‘జికా’ కలకలం.. ఇద్దరు గర్భిణులకు పాజిటివ్
ఈ వైరస్ బారినపడినవారిలో ఇద్దరు గర్భవతులు కూడా ఉన్నారు
- By Sudheer Published Date - 11:52 AM, Tue - 2 July 24

మహారాష్ట్రలోని పుణే (Pune)లో జికా వైరస్ (Zika Virus) విజృంభిస్తోంది. ఇద్దరు గర్భిణులు సహా ఆరుగురికి ఈ వైరస్ సోకింది. జికా వైరస్ వ్యాధి (ZVD) అనేది ఏడిస్ దోమల ద్వారా సంక్రమించే వ్యాధి. అదే దోమ డెంగ్యూ, చికున్‌గున్యా మరియు ఎల్లో ఫీవర్ అనే మూడు ఇతర వెక్టర్ ద్వారా సంక్రమించే వ్యాధులను కూడా వ్యాపిస్తుంది. ఇది సాధారణంగా పగటిపూట కుడుతుంది. ఈ వైరస్ ను తొలిసారిగా ఉగాండాలో 1947లో కనుగొన్నారు. ఈ వైరస్ సోకిన వారిలో జ్వరం, చర్మంపై దద్దుర్లు, కండరాలు, కీళ్ల నొప్పులు, తలనొప్పి, జీర్ణ కోశ సంబంధ సమస్యలు, గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రపంచాన్ని వణికిస్తున్న జికా వైరస్ పై భారత దేశ కేంద్రప్రభుత్వ ఆరోగ్యశాఖ అప్రమత్తం అయింది. ఇప్పటికి ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ వైరస్ నలభై లక్షల మందికి సోకే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రధానంగా గర్భిణీలు తేలిగ్గా ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వారు చెప్పినట్లు ఇప్పుడు ఈ వైరస్ మహారాష్ట్రను వణికిస్తోంది. తాజాగా పూణే లో ఈ వైరస్ విజృంభిస్తుండటంతో ఇప్పటివరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడినవారిలో ఇద్దరు గర్భవతులు కూడా ఉన్నారు. దీంతో రాష్ట్ర ఆరోగ్యవిభాగం అప్రమత్తమయ్యింది. వైరస్ వ్యాప్తి నివారణకు పుణె మున్సిపల్ అధికారులు చర్యలు ప్రారంభించారు. జికా వైరస్ వ్యాప్తికి కారణమైన దోమలను తరిమికొట్టేందుకు నగరంలో విస్తృతంగా ఫాగింగ్ చేస్తున్నారు.
రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపిన వివరాల ప్రకారం అరంద్వానేలో మొదటి కేసు నమోదయింది. 46 ఏండ్ల డాక్టర్ తొలుత జికా వైరస్ బారిపడ్డారు. అనంతరం అతని కుమార్తె (15)కు వైరస్ సోకినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. వీరిద్దిరితోపాటు ముండ్వాకు చెందిన ఇద్దరి రిపోర్టులు పాజిటివ్‌గా వచ్చాయి. ఈ నాలుగురితోపాటు అరంద్వానేకు చెందిన ఇద్దరు గర్భిణులకు జికా వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.
Read Also : Majority Population : ఇలాగే జరిగితే.. మెజారిటీ ప్రజలు మైనారిటీలు అవుతారు : హైకోర్టు