Ladies : పీరియడ్స్ వచ్చినప్పుడు మహిళలు జిమ్ లేదా యోగా చేయవచ్చా?
మహిళలు పీరియడ్స్ సమయంలో అన్ని రకాల పనులను చేస్తున్నారు కానీ జిమ్, యోగా అనేవి చేయవచ్చా లేదా అనేది కొందరికి ఒక సందేహంగా ఉంటుంది.
- By News Desk Published Date - 05:00 PM, Sat - 6 April 24

Ladies : పీరియడ్స్(Periods) అనేది 13 -14 నుండి 45 సంవత్సరాల వయసు గల స్త్రీలలో ప్రతి నెల వచ్చే సాధారణ విషయం. అయితే మనకు మన పెద్దవారు ఆ సమయంలో స్త్రీలకు విశ్రాంతి అవసరం అని చెబుతుంటారు. అందుకే వారిని ఏ పని చేయవద్దని చెబుతుంటారు. అయితే ఇప్పుడు మహిళలు పీరియడ్స్ సమయంలో అన్ని రకాల పనులను చేస్తున్నారు కానీ జిమ్(Gym), యోగా(Yoga) అనేవి చేయవచ్చా లేదా అనేది కొందరికి ఒక సందేహంగా ఉంటుంది.
జిమ్ లో వెయిట్ లిఫ్ట్ చేసే పనులను పీరియడ్స్ సమయంలో చేయకూడదు. ఎందుకంటే అలా చేస్తే స్త్రీలకు గర్భాశయం మరియు శరీరం పైన ఎక్కువ భారం పడుతుంది. కాబట్టి ఇలాంటివి చేయకూడదు. జిమ్ లో సైక్లింగ్ వంటివి చేయవచ్చు. యోగా ఆసనాలు అన్నీ చేయకూడదు. సూర్య నమస్కారాలు, సింపుల్ గా ఉండే ఆసనాలు వంటివి చేయవచ్చు. అంతేకాని తలకిందులుగా ఉండే ఆసనాలను పీరియడ్స్ టైమ్ లో చేయకూడదు. అప్పుడు రక్తప్రవాహాన్ని వ్యతిరేక దిశలో ప్రవహించేలా చేస్తుంది.
శరీరాన్ని మెలితిప్పిన ఆసనాలు వంటివి వేయకూడదు. వీటి వలన గర్భాశయం పైన అధిక ఒత్తిడి పడి రక్తస్రావం అధికంగా అవుతుంది. జిమ్, యోగా వంటివి చేయాలి అనుకుంటే వాటిలో సింపుల్ వి చేయవచ్చు. ఎక్కువగా పరుగెత్తడం, ఎక్కువ బరువులు ఎత్తడం వంటివి చేయకుండా సాధారణంగా నడవడం, సామ్యూల్ గా ఉండే ఆసనాలు వంటివి చేయవచ్చు. కాబట్టి ఈసారి పీరియడ్స్ టైంలో యోగా, జిమ్ చేయాలనుకుంటే ఆలోచించి ఈజీగా, సింపుల్ గా ఉండేవి, శరీరానికి ఎక్కువ కష్టం కలిగించనివి చేయండి.
Also Read : Summer: వడదెబ్బతో బాధపడుతున్నారా.. ఈ జాగ్రత్తలు మస్ట్, అవి ఏమిటంటే