Heart Attack while Exercising: గుండెపోటు వ్యాయామం చేస్తున్నప్పుడే ఎందుకు వస్తుంది.. నిపుణులు ఏం చెప్తున్నారు?
ఈ మధ్యకాలంలో చాలా మంది వ్యాయామం చేస్తున్న సమయంలోనే ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారు. ఇటీవల
- By Nakshatra Published Date - 08:24 AM, Wed - 17 August 22
ఈ మధ్యకాలంలో చాలా మంది వ్యాయామం చేస్తున్న సమయంలోనే ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో ఇలా వ్యాయామం చేస్తున్న సమయంలోనే గుండెపోటు కారణంతో చాలామంది చనిపోతున్నారు. కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీలు కూడా ఇలా వ్యాయామం చేస్తున్న సమయంలోనే గుండెపోటుకు గురవుతున్నారు. అయితే మామూలుగా గుండె కండరాల బలోపేతానికి వ్యాయామాలు మంచి చేస్తాయని చెబుతూ ఉంటారు. అటువంటప్పుడు వ్యాయామం చేస్తే గుండెపోటు రావడం ఏంటి? అన్న సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది.
అయితే వ్యాయామం చేయడం వల్ల వచ్చే మంచి ఫలితాలు నిజమే కానీ, చేసే వారి ఆరోగ్య పరిస్థితులు కూడా చూసుకోవాలి. వ్యాయామం తీవ్రత పై ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో ఉన్నట్టుండి అడ్డంకి ఏర్పడితే గుండెపోటు వస్తుంది. గుండెకి రక్తాన్ని పంప్ చేసే కరోనరీ ఆర్టరీల్లో అవరోధం కలిగితే హార్ట్ ఎటాక్ కు దారితీస్తుంది. హృదయ ధమనిలో 70 శాతం మేర అవరోధం కలిగితే అప్పుడు యాంజీనా లేదంటే ఛాతీలో నొప్పి వస్తుంది. అదే సమయంలో వ్యాయామం చేస్తున్నట్టు అయితే అధిక ఆక్సిజన్ అవసరపడుతుంది.
ఆక్సిజన్ కు డిమాండ్ పెరగ్గా అదే సమయంలో ధమనిలో అవరోధం ఏర్పడి తద్వారా గుండెపోటు వస్తుంది. అలాగే ధమనుల్లో ఏర్పడిన కొవ్వు ఫలకాలు విచ్ఛిన్నం అయితే అది రక్తం గడ్డకట్టేందుకు దారితీస్తుంది. 30 శాతం పరిమాణానికి కొవ్వు చేరినప్పుడు ఇలా జరుగుతుంది. కొవ్వు ఫలకాలుగా పేరుకుపోవడానికి, పొగతాగడం, రక్తపోటు, మధుమేహం, ఆరోగ్యకరం కాని ఆహారం, ఒత్తిడి, తగినంత నిద్ర లేకపోవడం, ఇటీవల ఇన్ఫెక్షన్లకు గురికావడం గుండె పోటుకు దారిస్తాయి. రక్తంలోని కొవ్వులు గాయం అయిన ప్రాంతాలపై గారలా పేరుకుపోయినప్పుడు కష్టమైన వ్యాయామాలు చేయడం వల్ల అది గుండెపోటును కలిగిస్తుంది. కాబట్టి వ్యాయామం చేసే ముందు మన ఆరోగ్య స్థితిగతులు సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత వ్యాయామం చేయాలి.
Related News
Jalebi Baba : 120 మంది మహిళలను అత్యాచారం చేసిన ”జిలేబీ బాబా” మృతి ..
తాను చేతబడులు తొలగిస్తానని, దుష్టశక్తుల పని పడతానని నమ్మబలికి ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం చేశాడు