Orange: ఈ సమస్యలు ఉన్నవారు కమలా పండు అసలు తినకండి.. చాలా డేంజర్!
కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు కమలా పండు అస్సలు తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 03:00 PM, Wed - 8 January 25

చలికాలంలో లభించే పండ్లలో కమలా పండ్లు కూడా ఒకటి. ఎక్కడ చూసినా కూడా మార్కెట్లో మనకు ఈ కమలా పండ్లు కుప్పలు కుప్పలుగా పోసి అమ్ముతూ ఉంటారు. ఇవి ధర కూడా తక్కువే. ఇవి కొన్ని తినడానికి తియ్యగా మరికొన్ని చప్పగా, మరికొన్ని పుల్లగా ఉంటాయి. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే తింటూ ఉంటారు. కమలా పండ్ల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కొందరు వీటిని నేరుగా తింటే మరికొందరు జ్యూస్ రూపంలో కూడా తీసుకుంటూ ఉంటారు. కమలాపండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది నిమ్మ, గ్రేప్ ఫ్రూట్, బత్తాయిలానే సిట్రస్ జాతికి చెందిన పండు.
కమలా పండులో విటమిన్ సి, ఐరన్, మెగ్నిషియం, కాల్షియం, ఫైబర్, పొటాషియం, బి6 వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో అనేక వ్యాధుల నుంచి బాధపడవచ్చు. చలికాలంలో సూర్యరశ్మి ఎక్కువగా ఉండదు. దీంతో శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందదు. అదే కమలా పండు తింటే విటమిన్ అందుతుంది. ఈ పండు తినడం వల్ల రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ ను కూడా అదుపు చేస్తుంది. అయితే కమలా పండు తినడం మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు అసలు తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఈ సీజన్‌లో జలుబు, దగ్గు సమస్యలతో చాలా మంది బాధపడతారు. జలుబు, దగ్గు లేనివారు ఏం చక్కగా కమలా పండ్లు తినవచ్చు.
అయితే, ఇప్పటికే జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారు కమలా పండ్లు తినకూడదట. ఇలాంటి వారు కమలా పండ్లు తినడం వల్ల జలుబు తీవ్రత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా పొడి దగ్గు ఉన్నవారు వీటి జోలికి పోకపోవడమే మంచిదట. పొడి దగ్గు ఉన్నావారు తింటే ఉన్న దగ్గు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయట. ఆ తర్వాత ఊపిరాడదు. గొంతు నొప్పి వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని. అలాగే జీర్ణ సమస్యలతో బాధపడేవారు కమలా పనులు తినకూడదట. దీంతో పొత్తి కడుపు తిమ్మరి, ఉబ్బరం, కడుపు నొప్పి, అతిసారానికి దారి తీయవచ్చు. ఈ పండు ఎక్కువగా తిన్నా వికారం, వాంతులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే జీర్ణ సమస్యలు ఉన్నవారు కమలా పండ్లు తినకూడదట.
కమలా పండ్లు తక్కువ మోతాదులో తింటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎక్కువ తింటేనే అసలు సమస్య వస్తుందట. బరువు తగ్గాలనుకునేవారు కమలా పండ్లను ఎక్కువ మోతాదులో తినకూడదట. ఎసిడిటీ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా కమలాపండ్లు తినకూడదట. కమలాలను అధికంగా తినడం వల్ల గుండె మంట సమస్యను ఎదుర్కొంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గ్యాస్ కూడా ఎక్కువ అవుతుందట. అందుకే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు కమలా పండ్లను ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొందరు అలర్జీ, శ్వాసకోస వ్యాధులతో బాధపడతారు. అలాంటి వారు కమలా పండ్ల వినియోగం తగ్గించుకోవాలని, ఈ పండ్లను ఎక్కువ తినడం వల్ల ఇలాంటి వారికి అలర్జీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు. చర్మంపై ఎర్రటి మచ్చలు, మంట, దద్ధుర్లు వచ్చే ప్రమాదముంది. అందుకే ఈ సమస్యలు ఉన్నవారు కమలా పండ్లను తినకపోవడమే మంచిదని అంటున్నారు.