Cucumber: కీరదోసకాయ ఆరోగ్యానికి మంచిదే కానీ, వాళ్ళు అసలు తినకూడదట.. ఎవరంటే?
కీరదోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని దీనిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి అని, కానీ కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు ఈ కాయ తినకపోవడమే మంచిదని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:00 PM, Wed - 2 April 25

కీరదోసకాయ.. మన వంటింట్లో దొరికే కూరగాయలలో ఇది కూడా ఒకటి. దీనిని పచ్చిగా లేదంటే కూరల్లో వేసుకొని తింటుంటారు. అయితే చాలా మంది ఈ కీరదోసకాయను పచ్చిగా తినడానికె ఇష్ట పడుతుంటారు. ఈ కీరదోసలో నీటి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుందట. అలాగే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయట. అయితే కీరదోసకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా కొన్ని సమస్యలు ఉన్నవారు వీటిని తినకపోవడమే మంచిందని చెబుతున్నారు. ఇంతకీ వారు ఎవరంటే.. యూరిన్ సమస్యలు ఉన్నవారు కీరదోస అస్సలు తినకూడదట. ముఖ్యంగా ఎక్కువ యూరిన్ వెళ్లేవారు ఈ కీరదోసకు దూరంగా ఉండటమే మంచిదని చెబుతున్నారు.
అలాగే ఎసిడిటీ ప్రాబ్లం ఉండేవారు కీరదోస తినకుండా ఉండాలట. ఒకవేళ తినాలి అనుకుంటే వారికి ఎసిడిటీ ప్రాబ్లం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుందట. కాబట్టి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలట. జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. కాబట్టి ఈ సమస్య ఉన్నవాళ్ళు కీరా తినకపోవడమే మంచిదట. అలాగే కీరదోసలో కూలింగ్ ఫ్యాక్టర్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జలుబు, దగ్గు లాంటి సమస్య ఉన్నవారు కీరదోస తినకపోవడమే మంచిదని, జలుబు ఉన్న సమయంలో తింటే జలుబు మరింత పెరిగే అవకాశం ఉంటుందట. కాబట్టి జాగ్రత్తగా ఉండాలట. కాగా ఎవరికైనా స్కిన్ ఎలర్జీలు ఉన్నా, లేదంటే ఏదైనా ఫుడ్ ఎలర్జీలు ఉన్నా కూడా కీరదోస తినకూడదట.
వీలైనంత వరకు దానికి దూరంగా ఉండాలని, లేకపోతే స్కిన్ ఎలర్జీ మరింత పెరిగే అవకాశం ఉంటుందట. కీరదోస ఆరోగ్యానికి ఎంత మంచిదైనా చలికాలం, వర్షాకాలంలో మాత్రం కీరదోస అస్సలు తినకూడదట. ఈ కాలాల్లో కీరదోస తింటే అరుగుదల సమస్యలు వస్తూ ఉంటాయట. ఇక కీరదోస ఎంత ఆరోగ్యానికి మంచిది అయినా రాత్రిపూట దానిని అస్సలు తినకూడదట. ఎందుకంటే రాత్రిపూట తినడం వల్ల నిద్రకు ఆటంకం కలుగుతుందట. మంచిదే కదా అని ఎండాకాలంలో అయినా కీరదోస ఎక్కువ మొత్తంలో తినకూడదట. ఎక్కువ మొత్తంలో కీరదోస తింటే డీ హైడ్రేషన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. అలాగే నెగిటివ్ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు.