HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >What Should Be The Ideal Pregnancy Gap

Pregnancy Gap : మొదటి కాన్పుకు రెండవ కాన్పుకు మధ్య అంతరం ఎంత ఉండాలి..?

ప్రతిజంట తమ బిడ్డ ఆరోగ్యంగా జన్మించాలని కోరుకుంటారు. మొదటి కాన్పు గురించి పక్కనపెడితే...రెండో కాన్పు విషయంలో మాత్రం గర్భదారణకు గ్యాప్ అవసరం.

  • Author : hashtagu Date : 01-09-2022 - 7:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pregnancy
Pregnancy

ప్రతిజంట తమ బిడ్డ ఆరోగ్యంగా జన్మించాలని కోరుకుంటారు. మొదటి కాన్పు గురించి పక్కనపెడితే…రెండో కాన్పు విషయంలో మాత్రం గర్భదారణకు గ్యాప్ అవసరం. అయితే మన చేతుల్లో ఉండకపోయినా…కొన్నిసందర్భాల్లో చాయిస్ గా ఉంటే…ఇంకొన్నిసార్లు చాన్స్ గా ఉంటుంది. నిజానికి మొదటిబిడ్డ జన్మించిన తర్వాత 6 నెలలోపు గర్భం దాల్చకూడదని అమెరికన్ కాలేజ్ ఆఫ్ అబ్ స్టెట్రిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్ కూడా సలహా ఇస్తున్నారు. కానీ అంతకన్నా తక్కువ వ్యవధిలో రెండోసారి గర్భం దాల్చినట్లయితే…తల్లి, బిడ్డ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపింది. ఈ నేపథ్యంలో కాన్పుకు కాన్పుకు మధ్య గ్యాప్ ఎంత ఉండాలి. తక్కువ గ్యాప్ ఉంటే ఎలాంటి ప్రమాదం ఉంటుంది. వాటిని ఎలా పరిష్కరించుకోవాలి. తెలుసుకుందాం.

మొదటికాన్పు తర్వాత తల్లి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆలోపు మరో బిడ్డ కోసం శరీరానికి సిద్ధం చేసుకునేందుకు అనుమతిస్తుంది. కానీ ఈ గ్యాప్ తక్కువగా ఉన్నట్లయితే ఎలాంటి ప్రమాదంఉంటుంది.
* అకాల మరణం
* పుట్టుకతో వచ్చు రుగ్మతలు
* బరువు తక్కువగా ఉండటం
* రక్తహీనత
* అబర్షాన్స్
ఇవికాకుండా ఈ రకమైన గర్భదారణ వల్ల రెండో కాన్పులో పుట్టిన పిల్లల్లో ఆటిజం ప్రమాదం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు. సంవత్సరం లోపు కంటే తక్కువ వ్యవధిగల గర్భాల విషయంలో ఈ తరహా లక్షణాలు డెవలప్ చెందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటున్నారు. అంతేకాదు గర్భాల మధ్య గ్యాప్ తక్కువైతే తల్లిపాలలో పోషక నిల్వలు క్షీణిస్తాయని…అది పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చంటున్నారు.

ఎంత కాలం వేచి ఉండాలి.
రెండవ బిడ్డకు ప్లాన్ చేసుకునే ముందు మొదటి గర్భం నుంచి తల్లి శరీరం కోలుకుందని నిర్దారించుకోవాలి. భవిష్యత్తులో గర్భదారణ సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు నివారించేందుకు 18 నుంచి 24 నెలల గ్యాప్ తీసుకోవాలి. అలాగే అంతర వ్యవధి 5ఏళ్ల కంటే తక్కువగా ఉండాలి. 35ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్న జంటలు తమ గర్భం మధ్య 12 నెలల అంతరాన్ని పరిగణలోనికి తీసుకోవాలి. మొదటి బిడ్డ తర్వాత రెండో బిడ్డ ఎప్పుడు కావాలి అనేది వ్యక్తిగత అంశం. ఈ విషయంపై జంట చర్చించుకోవాలి. ఆరోగ్యంగా ఉండటం గర్బదారణకు సిద్ధం అనుకుంటే…డాక్టర్ సలహా మేరకు మరోసారి గర్భం దాల్చేందుకు రెండు సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదు.

ఆరోగ్యవంతమైన ప్రెగ్నెన్సీని ఎలా నిర్దారించుకోవాలి.
తల్లి శరీరం మరో గర్బం కోసం తగినంత ఆరోగ్యంగా ఉందని నిర్దాంచుకునేందుకు గర్భం దాల్చడానికి ముందే డాక్టరును సంప్రదించాలి. ఈ సమయంలో ఆహారంతోపాటు శారీరక, మానసిక శ్రేయస్సును కూడా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన గర్భదారణ కలిగి ఉండాలనుకుంటే ప్రినాటల్ కేర్ పొందడం చాలాఅవసరం.

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • baby
  • health
  • lifestyle
  • pregnency gap

Related News

    Latest News

    • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

    • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

    • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

    • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

    • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

    Trending News

      • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd