Fever: జ్వరం వచ్చినప్పుడు పొరపాటున కూడా వీటిని అస్సలు తినకండి.. తిన్నారో అంతే సంగతులు!
జ్వరం వచ్చినప్పుడు తెలిసి తెలియకుండా కూడా పొరపాటున కొన్ని రకాల ఆహార పదార్థాలు అసలు తినకూడదని చెబుతున్నారు. వాటి వల్ల అనేక సమస్యలు వస్తాయట.
- By Anshu Published Date - 05:35 PM, Tue - 25 March 25

మామూలుగా చాలామందికి సీజన్లో సంబంధం లేకుండా జ్వరం వస్తూ ఉంటుంది. జ్వరం రావడం అన్నది కామన్ అని చెప్పాలి. వెదర్ చేంజ్ అయినప్పుడు అలాగే రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు, చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు జ్వరం వస్తూ ఉంటుంది. అది ఈ జ్వరం వచ్చినప్పుడు నోరంతా చేదుగా ఉండి ఎలాంటి ఆహార పదార్థాలు తినాలి అనిపించదు. ఏది తిన్నా కూడా టేస్ట్ ఉండదు. అందుకే జ్వరం వచ్చినవాళ్లు అవి కావాలి, ఇవి కావాలి అని రకరకాల ఫుడ్స్ ను అడుగుతుంటారు. కానీ జ్వరం వచ్చినప్పుడు ఏవి పడితే అవి తినకూడదట. అది జ్వరంని మరింత ఎక్కువ చేస్తాయని చెబుతున్నారు. జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి అన్న విషయానికి వస్తే..
ప్రాసెస్ చేసిన ఆహారాలు చాలా టేస్టీగా ఉంటాయి. కేకులు, కుకీలు, చిప్స్ వంటివన్నీ ప్రాసెస్ చేసినవే. అయితే జ్వరం ఉన్నప్పుడు వీటిని మాత్రం తినకూడదట. ఎందుకంటే ఇవి మీ ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయని,జ్వరం ఎక్కువయ్యేలా చేస్తాయని చెబుతున్నారు. అలాగే పాలు, పెరుగు, మజ్జిగ వంటి పాలతో చేసిన ఆహారాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటి ద్వారా ఎన్నో పోషకాలు కూడా అందుతాయి. కానీ జ్వరం ఉన్నప్పుడు మాత్రం వీటిని తినకూడదట. ఎందుకంటే ఇవి ఇవి మీ శరీర ఉష్ణోగ్రతను మరింత పెంచుతాయని అవుతున్నారు.
జ్వరం ఉన్నప్పుడు కారంగా ఉండే ఆహారాలతో పాటుగా తీయగా ఉండే ఆహారాలను కూడా తినాలి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆరోగ్యం బాగాలేనప్పుడు తీపి ఆహారాలను అస్సలు తినకూడదట. అలాగే పానీయాలను కూడా తాగకూడదట. వీటివల్ల మీరు త్వరగా కోలుకోవడానికి అవసరమైన పోషకాలు అందవని చెబుతున్నారు.
అలాగే గోధుమలు, తృణధాన్యాలు వంటి ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుందట. ఒకవేళ మీరు వీటిని తింటే మీ జీర్ణవ్యవస్థ చాలా తొందరగా అలసిపోతుందని,అందుకే జ్వరం ఉన్నప్పుడు ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే జ్వరం వచ్చినప్పుడు కాఫీలు టీలు ఎక్కువగా తాగడం ఆల్కహాల్ సేవించడం వంటివి కూడా చేయకూడదట. వీటికి బదులుగా పండ్లు కొబ్బరి నీళ్లు వంటివి తాగడం మంచిదని చెబుతున్నారు.