Weight Loss: ఈ డ్రింక్ తాగితే 2 నెలల్లో 20 కిలోలు తగ్గవచ్చా.. ఇందులో నిజమెంత?
ఓట్జెంపిక్ డ్రింక్ తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు అనడం నిజం లేదని చెబుతున్నారు.
- By Anshu Published Date - 06:00 PM, Sun - 18 August 24

ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ అధిక బరువు కారణంగా కొంత మంది వారి పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే బరువు తగ్గడానికి ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఎక్సర్సైజ్ చేయడం, డైట్ ఫాలో అవ్వడం, నాచురల్ రెమెడీస్ ఫాలో అవ్వడం ఇలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేసినా కూడా బరువు తగ్గక దిగులు చెందుతూ ఉంటారు. అయితే చాలామంది బరువు తగ్గాలంటే కేవలం ఎక్ససైజ్ మాత్రమే చేయాలని తెగ కష్టపడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ తాగితే చాలట.
ఈజీగా బరువు తగ్గవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ డ్రింక్ ఏదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. దీనినే ఓట్జెంపిక్ డ్రింక్.. దీనిని ఓట్స్, నీరు, నిమ్మరసం కలిపి తయారు చేస్తారు. ఒకవేల కావాలి అనుకుంటే దాల్చిన చెక్కని కూడా కలుపుకోవచ్చు. దీనిని రోజూ తీసుకుంటే కేవలం 2 నెలల్లోనే 20 కేజీలు తగ్గుతారట. ఇంతకీ దీనిని ఎలా తయారు చేయాలి అన్న విషయానికి వస్తే.. ముందుగా సగం కప్పు ఓట్స్ తీసుకోవాలి. ఇందులో కప్పు నీరు, అరచెక్క నిమ్మరసం కలిపి మిక్సీ పట్టాలి. తర్వాత డ్రింక్ రెడీ అయ్యాక ఇందులో ఇష్టం అనుకుంటే దాల్చిన చెక్క పొడి కలపాలి.
ఓట్స్ తో తయారైన ఈ డ్రింక్ ని తాగితే మీరు చాలాసేపు కడుపు నిండిన ఫీలింగ్ తో ఉంటారు. కాబట్టి ఎక్కువగా తినరు. దీంతో బరువు తగ్గుతారని చెబుతున్నారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారి రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుందట. ఇది ఆకలిని తగ్గిస్తుందట. ఓట్స్ బీటా గ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణమైనప్పుడు జెల్ ఏర్పడి జీర్ణక్రియ నెమ్మదిగా అవుతుంది. దీంతో ఆకలి కూడా తగ్గుతుంది. దీంతో ఎక్కువగా బరువు తగ్గుతారని చెబుతున్నారు.
ఓట్స్ ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, బరువు తగ్గడానికి ఈ డ్రింక్‌ని తీసుకోవాల్సిన అవసరం లేదట. దీని వల్లే బరువు తగ్గుతారు అనడంలో నిజం లేదని వాదిస్తున్నారు. ఓట్జెంపిక్ డ్రింక్‌ని రీప్లేస్‌మెంట్ షేక్స్‌తో చూసినప్పుడు ఇందులో అంతలా పోషకాలు ఉండవు. ప్రోటీన్ షేక్స్ సమృద్ధి పోషకాలతో నిండి ఉంటుంది. ఈ ఓట్జెంపిక్ డ్రింక్‌లో ఓట్స్ మాత్రమే ఉంటుంది. ప్రోటీన్ ఉండదు. కాబట్టి మీరు దీనిని ప్రోటీన్ పౌడర్, గ్రీక్ యోగర్ట్‌తో కలిపి తీసుకోవడం మంచిది అని నిపుణులు చెబుతున్నారు.
note : ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.