Pomegranate: 21 రోజుల పాటు రోజూ కప్పు దానిమ్మ గింజలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
Pomegranate: ప్రతీ రోజు అనగా 21 రోజుల పాటు ఒక కప్పు దానిమ్మ గింజలు తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు. ఇంతకి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 07:03 PM, Sun - 16 November 25
Pomegranate: దానిమ్మ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దానిమ్మ తినడం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయట. ముఖ్యంగా ప్రతిరోజూ ఒక కప్పు దానిమ్మ గింజలు తినటం వల్ల లెక్కలేనన్నీ లాభాలు ఉన్నాయట. ఇవి మన మెదడు ఆరోగ్యానికి చాలా మంచిదని, రోగనిరోధక శక్తిని పెంచుతుందని, ఈ పండు పుష్కలమైన పోషకాలతో నిండి ఉంటుందని చెబుతున్నారు. తక్కువ కేలరీలు, కొవ్వు ఉండటం వల్ల త్వరగా బరువు తగ్గటానికి వీలుగా ఉంటుందట.
విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయని, దానిమ్మతో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయని,ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయని, వ్యాధులను నిరోధించేందుకు సహాయపడతాయని చెబుతున్నారు. కాగా దానిమ్మ గింజల్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందట. ఇది అజీర్ణం సమస్యను నివారిస్తుందట. అలాగే దీనిలోని యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు పేగుల్లో మంట, వాపు వంటి సమస్యలు రాకుండా కాపాడుతాయట. దానిమ్మ గింజల్లో పాలిఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయట. ఇవి చర్మాన్ని యూవీ కిరణాలు, ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి కాపాడుతాయని, తద్వారా చర్మం ఎల్లపుడూ యవ్వనంగా కనిపిస్తుందని చెబుతున్నారు.
కండరాల నొప్పులు, గాయాలు తగ్గించడంలో దానిమ్మ గింజలు సహాయపడతాయట. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు కండరాలను బలంగా ఉంచుతాయని, దానిమ్మ గింజల్లోని పాలిఫినాల్స్ రక్తపోటు అదుపులో ఉంచి గుండెపై ఒత్తిడి నివారిస్తాయని చెబుతున్నారు. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుందట. హృదయ సంబంధ సమస్యలు రాకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు. దానిమ్మ గింజలు నమలడం ద్వారా దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా మారుతాయట. అలాగే దంతాలు కూడా తెల్లగా తయారవుతాయట. నోటి దుర్వాసన దూరమవుతుందని, దానిమ్మ గింజల్లో ఉండే ఫైబర్ పేగు కండరాల కదలికలను మెరుగుపరుస్తుందట.
మలం గట్టిపడకుండా చూస్తుందట. తద్వారా మలబద్ధకం నుంచి ఉపశమనం కల్పిస్తుందట. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు దానిమ్మ గింజలు తరచుగా తినడం మంచిదని చెబుతున్నారు. కాగా దానిమ్మ గింజలు 21 రోజుల పాటు తినడం ద్వారా ఒత్తిడి కూడా తగ్గుతుందట. ఇవి తక్షణ శక్తిని అందించి మంచి మూడ్ ను అందిస్తాయట. తద్వారా ఒత్తిడి దూరమవుతుందని, దానిమ్మ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయని, ఇవి ఆక్సిడేటివ్ ఒత్తిడి నుంచి మెదడు కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయని చెబుతున్నారు.