Mango: వేసవికాలంలో దొరికే మామిడిపండ్లను రోజుకు ఎన్ని తినాలో మీకు తెలుసా?
మామిడి పండ్లు మంచివే కానీ, అతిగా తినకూడదని చెబుతున్నారు. మరి సమ్మర్ లో మామిడి పండ్లను రోజుకి ఎన్ని తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 11:00 AM, Mon - 31 March 25

వేసవికాలం వచ్చింది అంటే చాలు చాలామంది చూపు మామిడి పండ్ల వైపు వెళ్తుంది. ఎందుకంటే ఈ మామిడి పండ్లు కేవలం వేసవి కాలంలో మాత్రమే లభిస్తూ ఉంటాయి. వీటి కోసం ఏడాది మొత్తం ఎదురు చూసే వారు కూడా ఉన్నారు. అయితే కేవలం వేసవికాలంలో మాత్రమే దొరుకుతాయి అని చాలా మంది వీటిని తెగ తినేస్తూ ఉంటారు. బాగా పండిన తీపిగా ఉన్న మామిడి పండ్లను ఎక్కువ మొత్తంలో తింటూ ఉంటారు. ఇలా తినడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు.
మరి వేసేవి కాలంలో ప్రతిరోజు ఎన్ని మామిడిపండ్లు తినవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మామిడి పండు ఎక్కువగా తినడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, అల్సర్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయట. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన ఫైటో న్యూట్రియెంట్లు మామిడిలో పుష్కలంగా లభిస్తాయట. ఇది శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుందని, ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. మామిడిని సరిగ్గా శుభ్రం చేయకుండా తింటే, దానిలోని హానికరమైన పదార్థాలు కడుపు సమస్యలను కలిగిస్తాయట.
దీని కారణంగా శరీరంలో విషపూరిత పదార్థాల పరిమాణం పెరుగుతుందట. అంతే కాకుండా మామిడి పండ్లను ఎక్కువగా తీసుకుంటే బ్లడ్ షుగర్, డయేరియా వంటి సమస్యలు వస్తాయట. కాగా మామిడి పండ్లను ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయట. మామిడిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్, నొప్పి, ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయట. కాబట్టి మామిడి పండ్లను పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.కాగా రోజుకు గరిష్టంగా 3 మామిడి పండ్లు మాత్రమే తినాలట. ఒక రోజులో ఎక్కువ మామిడి పండ్లు తినకూడదట. ఇకపోతే చాలా మంది వ్యాపారులు మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్ ను ఉపయోగిస్తున్నారు. ఈ రసాయనం నీటిలో కలిసినపుడు ఎసిటిలీన్ అనే వాయువు విడుదలై పండ్లను వేగంగా పక్వానికి గురి చేస్తుందట. ఇలా పండిన పండ్లు శరీరానికి విషపూరితమని చెబుతున్నారు. ఇది తీవ్రమైన సమస్యలను కలిగిస్తుందట. కాబట్టి మార్కెట్ నుండి మామిడి పండ్లను తెస్తే వాటిని కనీసం 3 గంటల పాటు నీళ్లలో నానబెట్టి బాగా తినాలట. నానపెట్టిన తర్వాత తింటే పెద్దగా ప్రమాదం ఉండదని, అలా అని ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదని, నీటిలో నానబెట్టిన పండ్లు అయినా సరే మూడు మాత్రమే రోజుకు తినాలని చెబుతున్నారు.