Expired Food: ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన ఆహార పదార్థాలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన ఆహార పదార్థాలు తింటే ఏం జరుగుతుందో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 02:34 PM, Thu - 6 February 25

మనం రోజు తినే ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో ఒక రకమైన ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. మామూలుగా మనం బయటకు వెళ్ళినప్పుడు మాకు నచ్చినవి తినడానికి కొనుగోలు చేస్తూ ఉంటాం. కొన్ని పనుల వల్ల వాటిని తినడం పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలా అవి చూస్తుండగానే ఎక్స్‌పైరీ డేట్ అయిపోతూ ఉంటాయి. అలా ఎక్స్‌పైరీ అయిపోయిన వాటిని కొంతమంది డబ్బులు పెట్టాం కదా ఎందుకు పాడేయాలి అని వాటిని అలాగే తినేస్తూ ఉంటారు.
కానీ ఇలా ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన వాటిని తీసుకోకూడదని ఎప్పటికప్పుడు వైద్యులు హెచ్చరిస్తూనే ఉంటారు. ఒకవేళ ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన ఆహార పదార్థాలు తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గడువు ముగిసిన ఆహారాలు బ్యాక్టీరియా పెరుగుదల, అచ్చు లేదా రసాయన మార్పులకు గురవుతాయట. ముఖ్యంగా పాల ఉత్పత్తులు చాలా త్వరగా పాడవడమే కాకుండా అనేక రకాల ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయట. మీరు ఎప్పుడైనా పొరపాటున ఏదైనా గడువు ముగిసిన పండ్లు, కూరగాయలు, మసాలా, బ్రెడ్ తిన్నారా? ఈ ఫుడ్ పాయిజనింగ్ లేదా అజీర్ణం కారణంగా చాలా మంది అనారోగ్యానికి గురవుతారట.
తరచుగా మంచి ముందు తేదీ, అమ్మిన తేదీ, ఉపయోగం వారీ తేదీ లేదా ఫ్రీజ్ బై తేదీ కంటే ఎక్కువ సార్లు ఆహారం తినడం తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుందని చెబుతున్నారు. చిప్స్, డ్రై స్నాక్స్ వంటి ప్యాక్ చేయబడిన వస్తువులు గడువు తేదీ తర్వాత తింటే తక్కువ ప్రమాదం ఉంటుందట. అయితే పాల ఉత్పత్తులు లేదా మాంసం వంటి ఆహారాలు సాపేక్షంగా త్వరగా ప్రమాదకరంగా మారవచ్చట. కొన్నిసార్లు ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఫుడ్ పాయిజింగ్ అయ్యి వాంతులు విరేచనాలు వంటివి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. అలాగే ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చట. కాబట్టి ఎక్స్‌పైరీ అయిపోయినా కూడా అవి మీ ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిర్ధారించుకున్న తర్వాత వాటిని తినడం మంచిదని, లేదంటే అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.