HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >What Happens If You Give Up Coffee For A Month

Coffee: నెలరోజుల పాటు కాఫీ మానేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

నెల రోజులపాటు కాఫీ మానేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిపారు.

  • Author : Anshu Date : 09-10-2024 - 11:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Coffee
Coffee

మనలో చాలామందికి కాఫీలు, టీలు తాగే అలవాటు ఉండే ఉంటుంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చాలాసార్లు కాఫీ టీ తాగుతూ ఉంటారు. రోజులో కనీసం ఒక్కసారైనా కాఫీ లేదా టీ తాగనిదే రోజు కూడా గడవదు. రోజుకు కనీసం ఒక్కసారైనా కాఫీ తాగాల్సిందే అని చాలామంది అంటూ ఉంటారు. అలాంటిది నెలరోజుల పాటు కాఫీ మానేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాఫీ టీలు తాగడం మంచిదే కానీ అలా అని ఎక్కువగా తాగితే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు.
కాఫీకి ఒక్కసారి అలవాటు పడితే చాలు దీన్ని తాగకుండా అస్సలు ఉండరు.

ఎందుకంటే దీని టేస్ట్ అంత అద్బుతంగా ఉంటుంది. అందులోనూ కాఫీని తాగితే ఆ వెంటనే ఎనర్జీ వస్తుంది. హుషారుగా మారిపోతారు. కాఫీలో ఉండే కెఫిన్ మనల్ని ఎనర్జిటిక్ గా మార్చుతుంది. తలనొప్పిని కూడా దూరం చేస్తుంది. అలసట ఇట్టే తగ్గిపోతుంది. అంతేకాదు దీనితో కూడా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. నెల రోజులపాటు కాఫీ తాగడం మానేస్తే ఏం జరుగుతుంది అన్న విషయానికి వస్తే.. కాఫీలో కెఫిన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మనకు నిద్రమత్తు లేకుండా చేస్తుంది. అంటే ఇది మనకు నిద్ర లేకుండా చేస్తుంది. కాఫీలోని కెఫిన్ కంటెంట్ మన నిద్ర విధానాలకు ఆటంకం కలిగిస్తుంది. అందుకే సాయంత్రం 6 తర్వాత కాఫీని అసలే తాగకూడదని చెబుతున్నారు.

అయితే ఒక నెల రోజుల పాటు మీరు కాఫీని తాగకుండా ఉంటే మీరు ఎంతో ప్రశాంతంగా, కంటినిండా నిద్రపోతారని నిపుణులు చెబుతున్నారు. అలాగే టైం టూ టైం కాఫీని తాగేవారు ఉన్నారు. వారికీ వారు సమయానికి కాఫీని తాగకపోతే ఏమీ తోచదు. కొందరికైతే తలనొప్పి కూడా వస్తుంది. అయితే ఒక నెల పాటు ఎలాగోలా కాఫీకి దూరంగా ఉంటే వీరు కెఫిన్ పై ఆధారపడే అలవాటు తగ్గుతుందట. అంటే మీరు కాఫీ లేకుండా కూడా ఉండగలుగుతారట. నెమ్మదిగా మీరు కాఫీలు మానేస్తారు అని చెబుతున్నారు. ఒక నెల పాటు కాఫీని తాగకుండా ఉండటం వల్ల మీ రక్తపోటు స్థాయిలు నియంత్రణలో ఉంటాయట. ఇలా ఉండటం వల్ల యాంగ్జైటీ తగ్గుతుందట. అంతేకాదు కొంతమందికి జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. కాఫీకి అలవాటు పడితే ఎప్పుడు పడితే అప్పుడు దీన్ని తాగాలనిపిస్తుంది. దీనివల్ల మీ డబ్బు బాగా ఖర్చు అవుతుంది. అయితే ఒక నెల రోజుల పాటు కాఫీ లేకుండా ఉంటే మీకు ఎంతో డబ్బు సేవ్ అవుతుందట. రోజుకు కనీసం ఒక 20 రూపాయలు చొప్పున వేసుకున్న నెలకు 600 రూపాయలు సేవింగ్ అవుతుందని చెబుతున్నారు. మీకు రోజూ కాఫీ తాగే అలవాటు ఉంటే దీన్ని మానేయడం వల్ల తలనొప్పి, చిరాకు, అలసట వంటి సమస్యలు వస్తాయి. కాఫీ తక్షణమే ఎనర్జీని ఇస్తుంది. అయితే కాఫీని మానేయడం వల్ల మీరు బలహీనంగా, అలసటగా ఉంటారు. కాఫీ లేకుండా ఉండటానికి శరీరం సర్దుబాటు చేసుకునేంత వరకు ఇలాగే ఉంటుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • coffee
  • Coffee Benefits
  • health tips
  • Month

Related News

Have you never drunk goat milk? Once you know this, you'll start drinking it immediately!

Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

మామూలుగా మనం తరచూ పాలను ఉపయోగిస్తూనే ఉంటాం. ఉదయం లేచిన దగ్గర్నుంచి సాయంత్రం పడుకునే వరకు పాలను కాఫీ లేదా టీ రూపంలో తీసుకుంటూ ఉంటాం. ఇంకొందరు పాలు మాత్రమే తాగుతూ ఉంటారు. కొంతమంది ఆవు పాలు తాగితే, మరికొందరు గేదె పాలు తాగుతూ ఉంటారు. ఎక్కువగా ఈ రెండు పాలను మాత్రమే ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా మేక పాలు తాగారా? ఆవు పాలకు లేదా గేదె పాలకు బదులుగా మేకపాలు తాగితే ఎన్నో రకాల [&hel

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • CM Chandrababu: ఏపీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. విద్యా రుణాలపై వడ్డీలో 4% రాయితీ

  • Gold Price: పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.?

  • Baba Ramdev: చంద్రబాబుపై బాబా రాందేవ్ ప్రశంసల వర్షం

  • Allu Arjun: కోర్టుకు రావాలంటూ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు

  • Skin Glow : స్కిన్ గ్లో కోసం అదిరిపోయే న్యూట్రియెంట్స్

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd