Curry Leaves: ప్రతిరోజు పరగడుపున 5 కరివేపాకు రెబ్బలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
కరివేపాకు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే పరగడుపున ప్రతిరోజు కరివేపాకు తింటే ఏమవుతుందో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 09-05-2025 - 9:00 IST
Published By : Hashtagu Telugu Desk
కరివేపాకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కరివేపాకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది మంచి సువాసన రావడంతో పాటుగా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. కరివేపాకు ను వంటల్లో ఉపయోగించడంతో పాటు పచ్చిగా కూడా తినవచ్చు అని చెబుతున్నారు. కరివేపాకుని తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయట. మరి ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం పరగడుపున 5 కరివేపాకు రెబ్బలు తినడం వల్ల ఎన్నో వ్యాధుల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.
కరివేపాకులో రకరకాల విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, పొటాషియం , యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇవి మన మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయట. కాగా ప్రతిరోజూ ఉదయం పరిగడుపున 5 కరివేపాకు రెబ్బలను తిన్నట్టైతే మీ బరువు ఈజీగా అదుపులో ఉంటుందట. కరివేపాకు రెబ్బలను తినడం వల్ల మీకు త్వరగా ఆకలిగా అనిపించదట. అలాగే మీరు అతిగా తినకుండా ఉంటారట. ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. జీర్ణక్రియ బలహీనంగా ఉన్నవారు ప్రతిరోజూ పచ్చి కరివేపాకు రెబ్బలను తిన్నా ప్రయోజనకరంగా ఉంటుందట. ఎందుకంటే ఇది మీ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని, అలాగే కడుపునకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు.
కరివేపాకును పచ్చిగా తినడం వల్ల మన ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు జరుగుతుందట. ఇది మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుందని, కరివేపాకును పచ్చిగా తినడం వల్ల మొటిమలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే ఐదు కరివేపాకు రెబ్బలు తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయట. ఇది డయాబెటిస్ పేషెంట్స్ కు ఎంతో మంచిది అని చెబుతున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుందట. రోజూ పరిగడుపున 5 కరివేపాకు రెబ్బలను తినడం వల్ల జుట్టు రాలే సమస్య కూడా చాలా వరకు తగ్గిపోతుందట. దీనిలో ఉండే గుణాలు జుట్టును మూలం నుంచి బలోపేతం చేయడానికి బాగా సహాయపడతాయట. కరివేపాకును పచ్చిగా నమిలి తినడం వల్ల మీరు తిన్న ఆహారం చాలా సులువుగా జీర్ణమవుతుందట. అలాగే మలబద్ధకం సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం కలుగుతుందట.