Hibiscus Flower: మందార పువ్వులు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
మందార పువ్వులు కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:10 PM, Fri - 2 August 24

మందార పువ్వుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కేవలం మందార పువ్వులు మాత్రమే కాకుండా మందార ఆకులు వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని ఎక్కువగా అందం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. కాగా మందార పువ్వుల్లో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ లు పుష్కలంగా లభిస్తాయి. ఇవన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజూ ఒక మందార పువ్వును తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అంటున్నారు వైద్యులు. ఏంటి మందార పువ్వు నువ్వు తినాలా అని ఆశ్చర్యపోతున్నారా.
అవునండోయ్ మందార పువ్వు కేవలం అందానికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందట. మరి మందార పువ్వును తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మందార పువ్వుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్ అని పిలువబడే హానికరమైన అణువులను నాశనం చేస్తాయి. ఇది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల రిస్క్ న తగ్గిస్తుంది. మందార పువ్వులు కూడా మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడతాయి. అవును మందార పువ్వు టీ తాగడం వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుందట. దీని వినియోగం బరువు తగ్గడానికి సహాయపడుతుందట..
మందార పువ్వుల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. కాగా మందారం పువ్వులు కాలేయంని ఆరోగ్యంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయట. ఈ పువ్వులు కాలేయం నుంచి విషాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయని చెబుతున్నారు. అలాగే ఇది టాక్సిన్స్ ను విడుదల చేసి కాలేయం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుందట. అలాగే మందార పువ్వుల్లో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. శరీరంలో రక్త లోపాన్ని తొలగిస్తుందట. రక్తహీనతతో బాధపడేవారు రోజూ ఒక పువ్వు తింటే ఒంట్లో రక్తం పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే మందార పువ్వులు రక్తపోటు పేషంట్లకు చాలా మేలు చేస్తాయట. బీపీ పేషంట్లకు ఈ మందార పువ్వులు వరం లాంటివని చెబుతున్నారు.