Mung Beans: తరచూ పెసలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?
వంటింట్లో మనకు అందుబాటులో ఉండే ఆహార పదార్థాలలో పెసలు కూడా ఒకటి. ఈ పెసలను పచ్చిగా లేదంటే కాల్చుకొని తింటూ ఉంటారు. ముఖ్యంగా వీటిని కాస్త
- By Anshu Published Date - 06:04 PM, Mon - 29 January 24

వంటింట్లో మనకు అందుబాటులో ఉండే ఆహార పదార్థాలలో పెసలు కూడా ఒకటి. ఈ పెసలను పచ్చిగా లేదంటే కాల్చుకొని తింటూ ఉంటారు. ముఖ్యంగా వీటిని కాస్త ఎండబెట్టుకుని వేయించుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి. పెసలు తరచూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు చేకూరతాయి. ముఖ్యంగా పెసలను నీటిలో నానబెట్టి తరువాత వాటిని మొలకెత్తించి తినడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. చాలామంది మొలకెత్తిన పెసలను ఇంకా ఇష్టంగా తింటూ ఉంటారు. పెసలు ఇంట్లో దొరకని వారు బయట ఐదు రూపాయల లో దొరికే
మొలకెత్తిన పెసలని తీసుకొని తింటూ ఉంటారు. మీకు తెలుసా మొలకెత్తిన పెసలు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి రోజూ ఒక కప్పు మొలకెత్తిన పెసలను తినడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. మొలకెత్తిన పెసలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ములగెత్తిన పెసలు డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. మొలకెత్తిన పెసలను తినడం వల్ల తింటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గి షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. మొలకెత్తిన పెసలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండవు.
మొలకెత్తిన పెసలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు రోజూ మొలకెత్తిన పెసలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచవచ్చు. పెసలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శక్తిని అందించడంతోపాటు బరువు తగ్గించడానికి దోహదపడుతుంది. అధిక బరువు తగ్గాలనుకునేవారు మొలకెత్తిన పెసలను రోజూ తినాలి.