Summer: శరీరంలో అలాంటి మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే వడదెబ్బ తగిలినట్టే!
వేసవికాలంలో వడదెబ్బ తగిలితే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి వారిలో ఎలాంటి ఈ సమస్యలు కనిపిస్తాయో, వాటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 11:08 AM, Tue - 18 March 25

దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలి అంటేనే ఇబ్బంది పడుతున్నారు. అలా కొద్దిసేపు ఎండలో నిలబడిన అలా బయటకు వెళ్లి వచ్చిన చాలు చాలామంది వడదెబ్బ బారిన పడుతున్నారు. నెమ్మదిగా ఎండలు మొదలయ్యే కొద్ది ఈ వడదెబ్బ బారిన పడే వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అయితే చాలామందికి వడదెబ్బ తగిలిన వారికి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అని తెలియదు. వడదెబ్బ తగిలిన వారికి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మనం తెలుసుకుందాం..
వేసవికాలంలో శరీర ఉష్ణోగ్రత 104 డిగ్రీలకు చేరుకున్నా, మించినా ఎండదెబ్బ తగిలినట్టు నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. అయితే ఇలా జరిగినప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలట. అలాగే శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల గుండె కూడా వేగంగా కొట్టుకోవడం మొదలుపెడుతుందని చెబుతున్నారు. శరీరం వేడి తగ్గించుకోవడం కోసం త్వరగా శ్వాస తీసుకోవడం మొదలు పెడుతుంది. శరీరం వేడెక్కినప్పుడు గుండె విపరీతమైన ఒత్తిడికి లోనవుతుందట. శరీరాన్ని సహజసిద్ధంగా చల్లబరిచే ప్రక్రియతో, ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేయడం కోసం గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెడుతుందని, ఫలితంగా ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది అని చెబుతున్నారు. ఎండదెబ్బతో మెదడు పనితీరు మీద ప్రభావం పడుతుందట. దాంతో అయోమయం, కళ్లు తిరగడం, కొన్ని సందర్భాల్లో ఫిడ్స్ కూడా కనిపించవచ్చట.
ఎండదెబ్బతో నాడీ వ్యవస్థ ప్రభావితమై, సమన్వయం కోల్పోతారట. దిక్కుతోచని స్థితికి లోనవుతారట. కోపం, నడవలేకపోవడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయని చెబుతున్నారు. అలాగే తలనొప్పి, తల తిరుగుడు కూడా ఉంటుందట. కాగా డీహైడ్రేషన్ వల్ల, ఎండదెబ్బతో నాడీ వ్యవస్థ పనితీరు దెబ్బతినడం వల్ల ఇలా జరగవచ్చని చెబుతున్నారు. అదేవిధంగా శరీరం అవసరానికి మించి వేడెక్కడం వల్ల వాంతులు మొదలవుతాయట. చర్మం కూడా పొడిబారి వేడెక్కుతుందని శరీరం ఎంత వేడెక్కినా చెమట పట్టదు అని చెబుతున్నారు. వేసవిలో వ్యాయామం తరువాత కండరాల నొప్పులు నిస్సత్తువ వంటి ఈ లక్షణాలు కనిపిస్తాయి. వీటిని కూడా సన్‌స్ట్రోక్ లక్షణాలుగా పరిగణించాలని చెబుతున్నారు. చెమట ద్వారా శరీరంలో ఉండే నీళ్ళని కోల్పోయే కొద్ది మైకం ఆవహిస్తుందట.